రాష్ట్రీయం

ఐసెట్ టాపర్ ఆదిత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ -2018 ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సాయన్న, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం సుబ్రహ్మణ్య శర్మ విడుదల చేశారు. ఐసెట్‌లో తొలి ర్యాంకు 164.28 మార్కులతో సత్య ఆదిత్య తాటి సాధించగా, రెండో ర్యాంకు 163.90 మార్కులతో వెల్చూరి సాయి సందీప్, 162.72 మార్కులతో గాదె నవీన్‌కుమార్ మూడో ర్యాంకు సాధించారు. ఈసారి ఎస్సీ కేటగిరిలోకి వచ్చే ఒక ట్రాన్స్‌జండర్ పరీక్ష రాయగా, అర్హత సాధించారు. పరీక్షకు 61439 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో పరీక్షకు 55191 మంది హాజరయ్యారు. అందులో 49812 మంది అర్హత సాధించారు. అర్హులైన వారిలో ఇద్దరు ట్రాన్స్ జండర్లు ఉన్నారని కన్వీనర్ సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు. అర్హత సాధించిన వారిలో ఒసి అమ్మాయిలు 6624, 5873 అబ్బాయిలు, బీసీ ఎ 1602 అమ్మాయిలు, 1961 మంది అబ్బాయిలు
ఉన్నారు. బీసీ బీలో 5541 మంది అమ్మాయిలు, 6335 అబ్బాయిలు, బీసీ-సి 214 మంది అమ్మాయిలు, 210 మంది అబ్బాయిలు, బీసీ డి 4313 మంది అమ్మాయిలు, 5464 మంది అబ్బాయిలు, బీసీ ఇ 1316 మంది అమ్మాయిలు, 2038 మంది అబ్బాయిలు, ఎస్టీలు 585 మంది అమ్మాయిలు, 1126 మంది అబ్బాయిలు, ఎస్సీలు 3235 మంది అమ్మాయిలు, 3374 మంది అబ్బాయిలు అర్హత సాధించారు. మొత్తంగా చూస్తే బిఎస్సీ చదివిన వారే ఎక్కువగా అర్హత సాధించారని కన్వీనర్ చెప్పారు. ఓయు పరిధిలో 46532 మంది, ఎయు పరిధిలో 694 మంది, ఎస్వీయు పరిధిలో 720 మంది, ఇతరులు 1866 మంది హాజరయ్యారని అన్నారు.