రాష్ట్రీయం

కాకినాడ, విశాఖకు 18 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్, విశాఖపట్నం వరకు 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. జూలై 1, 8, 15, 22, 29 తేదీల్లో లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే జూలై 6, 13, 20, 27 తేదీల్లో లింగంపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళుతుంది. తిరుగు ప్రయాణంలో జూలై 7, 14, 21, 28 తేదీల్లో విశాఖ నుంచి బయలుదేరుతుందని పేర్కొంది. అలాగే సంబల్‌పూర్-బనాస్‌వాడి-సంబల్‌పూర్ వారానికి ఒకసారి నడిచే 26 ప్రత్యేక సర్వీసులను వయా విజయవాడ మీదుగా నడుపుతుందని పేర్కొంది. సంబల్‌పూర్ నుంచి జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 15, 22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో నడుపుతుండగా, తిరుగు ప్రయాణంలో బనాస్‌వాడి నుంచి జూలై 6, 13, 20, 27, ఆగస్టు 3, 10, 17, 24, 31, సెప్టెంబర్ 7, 14, 21, 28న నడుపుతున్నట్లు రైల్వే స్పష్టం చేసింది.