రాష్ట్రీయం

ఊసేలేని ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక హోదాకూ దొరకని హామీ మూడో బడ్జెట్‌లోనూ మొండిచెయ్యి

ఇవీ కేటాయింపులు

కేంద్ర పన్నుల వాటాగా రూ. 24,637.36 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 106 కోట్లు, ట్రిపుల్ ఐటిలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటికి 40 కోట్లు, విశాఖపట్నం ఐఐఎంకు 30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటికి 40 కోట్లు, తిరుపతి ఐఐఎస్సీఆర్‌కు 40 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంటుకు 1,678 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టుకు 231.61 కోట్లు, కేంద్రీయ వర్శిటీకి రూ. కోటి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు 15 కోట్లు.

హైదరాబాద్: విభజన వల్ల హైదరాబాద్‌తోపాటు, ఆదాయాన్ని కోల్పోయి పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రకు వరసగా మూడోసారీ కేంద్ర బడ్జెట్‌లో అవమానం ఎదురైంది. ప్రత్యేకహోదా కల్పిస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు. దానివల్ల ఉపయోగం లేదని ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని ప్రకటనలు గుప్పించిన సిఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలకు విలువలేకుండా పోయింది. ఆంధ్రకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఆంధ్రకు 16వేల కోట్లు రెవెన్యూలోటు తేలింది. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ చేసి 13వేల కోట్ల లోటు ఉన్నట్టు కేంద్రానికి నివేదిక పంపారు. గత ఏడాది కేంద్రం 2300 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తంపోను 13 వేల కోట్లు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పినా, ఆ నివేదికను కేంద్రం పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టుకు 25వేల కోట్ల రూపాయలు అవసరమైతే, వందకోట్లు విదిల్చింది. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి నిధులను తాము సమకూర్చుతామని విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం తుంగలో తొక్కింది. 2016-17 బడ్జెట్‌లో విద్యా సంస్థలకు నిధులు ఇచ్చారు, కానీ దానివల్ల ఉపయోగం లేదని, ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యామని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. సిఎం చంద్రబాబు టీం హోదా లేదా ప్యాకేజీ విషయంలో సరిగా ప్రయత్నం చేయలేదన్నారు. వెనకబడిన జిల్లాలకూ ప్రత్యేక నిధులు ఇవ్వలేదన్నారు. విపక్ష పార్టీల నినాదాలు, నిరసనలు, అధికార పార్టీ ఢిల్లీ మంతనాలు, పర్యటనల వల్ల ఫలితం లేదని తేలిపోయిందని, ఆంధ్రకు జరిగిన అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా సమిష్టి పోరాటానికి సమయం ఆసన్నమైందన్నారు.
వైకాపా ఎమ్మెల్యే, ఆర్ధిక నిపుణులు బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన చట్టానికి పాతరేసిందని, ఆంధ్రకు తీరని ద్రోహం చేసిందని విరుచుకుపడ్డారు. కొన్ని విద్యా సంస్థలకు నిధులిచ్చినంత మాత్రాన ఆంధ్రకు న్యాయం చేసినట్లు ఎలా అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక సమయాన్ని వృథా చేయకుండా హోదా, ప్యాకేజీపై అమీతుమీ తేల్చుకోవాలని, కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులను పెట్టుకుని ఏమి సాధించినట్టని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్ధిక సలహాదారు కె నరసింహమూర్తి బడ్జెట్ కేటాయింపులపై బాధను మాత్రమే వ్యక్తం చేస్తూ, ఇంతకంటే ఇప్పుడేమీ స్పందించలేమన్నారు. ఫ్యాప్సీ మాజీ అధ్యక్షుడు అట్లూరి సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకపోతే ఆంధ్ర నిలదొక్కుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు.