రాష్ట్రీయం

నేతన్నకు ఆర్థిక దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: చేనేత కార్మికులను ఎట్టకేలకు ఆంధ్ర ప్రభుత్వం కరుణించింది. సుమారు 110.96 కోట్ల రూపాయిల రుణ బకాయిలను మాఫీ చేసింది. మరోపక్క ప్రతి చేనేత కార్మికుడికీ కనీసం లక్ష రూపాయిలు ప్రయోజనం కలిగేలా, గ్రూప్ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనానికి, రుణమాఫీకి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 2014 జూన్ 10న నాబార్డు మాజీ చైర్మన్ పి కోటయ్య అధ్యక్షతన కమిటీని నియమించింది. కోటయ్య కమిటీ చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కొన్ని సూచనలతో ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. అయితే కోటయ్య కమిటీ బంగారంపై రుణాలను సైతం మాఫీ చేయాలని, బ్యాంకు రుణాలు లక్షన్నర వరకూ మాఫీ చేయాలని సిఫార్సు చేసినా, ప్రభుత్వం మాత్రం లక్షకే పరిమితం చేసింది. 2014 మార్చి 31నాటికి చేనేత బకాయిలపై అధ్యయనం చేసిన ప్రభుత్వం, అప్పటికున్న బకాయిలు 110.96 కోట్లుగా లెక్కలు తేల్చింది. 5హెచ్‌పి కంటే తక్కువ సామర్థ్యమున్న విద్యుత్ కనెక్షన్లతో నిర్వహించే మగ్గాలకు సైతం రుణమాఫీని వర్తింపచేసింది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం జీవో 118 జారీ చేసింది.