రాష్ట్రీయం

భోగశ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం జరిగింది. 12 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి వద్ద భోగశ్రీనివాసమూర్తికి అర్చక స్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
చారిత్రక నేపథ్యం
పల్లవ రాణి సామవాయి పెరుందేవీ క్రీశ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవున్న వెండి భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన శాసనాలు ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వర స్వామివారి కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుక మూర్తి అని, శ్రీ మనవాళ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. ఈకార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో
రేపటి నుంచి శ్రీనివాస కల్యాణాలు
హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశ, విదేశాలలో శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఈనెల 19 నుంచి 29వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు. అన్నిచోట్ల సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 19న మామిడికుదురు మండల కేంద్రంలో, 20న అంబాజీపేట మండలం గంగలపూడు గ్రామంలోనూ, 21న ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో, 22న తొండగి మండల కేంద్రంలో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో 26న నరసాపురం మండలం పసలదేవి గ్రామంలోని శ్రీరాములవారి ఆలయ ప్రాంగణంలోనూ, 27న కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనూ, 28న ఉండ్రాజవరం మండలం తాడిపల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనూ, 29న చాగల్లు మండలం ఉన్నగట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాంగణం పాఠశాలలోనూ శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నట్లు టీటీడీ పీఆర్వో డాక్టర్ తలారి రవి ఆదివారం తెలిపారు.
చిత్రం..భోగశ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్న అర్చకస్వాములు