రాష్ట్రీయం

ఏపీ బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో రాజకీయ నేతల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘బాసు ఓటునాకే’ అంటూ ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఎవరూ మద్దతు అడక్కపోవడంతో పాపం కాంగ్రెస్ అంటూ న్యాయవాదులు చమత్కరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని పోటీ చేసే అభ్యర్థులు ఒప్పుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు బార్ కౌన్సిల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా చూస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత చేకూరుతోంది.
ఇక అభ్యర్థులు జిల్లాల్లో మకాం వేసి తమ మద్దతు దారులతో ఇటింటికి వెళ్ళి ఓటు వేయాలని కోరుతున్నారు. కొంతమంది హైకోర్టులోనే ప్రచారం సాగిస్తున్నారు. ఈనెల 29న బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఆయా పార్టీల నేతల కనుసన్నల్లో ప్రచా రం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయ పార్టీలు బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారానికి తమ కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ మద్దతుగా గుంటూరు జిల్లాకు చెందిన వద్దే శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ప్రత్యర్థులు ప్రచారంపై నిఘా వేసి నివేదికలను తెప్పించుకుంటున్నారు. తమ మద్దతుదారుడికి కరపత్రాలు, బ్యానర్లు వంటి సామాగ్రిని పంపుతున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీ వైసిపి మద్దతుతో ప్రకాశం జిల్లాకు చెందిన నాగిరెడ్డి ఎన్నికల గోదాలో ఉన్నారు. ఈయన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. కర్నూలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచా రం చేస్తున్నారు. వైసిపి ఎంపి, ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో మకాం వేసి తమ మద్దతుదారులతో ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలా తిరుగుతున్నారు. ఇక వామపక్షాల మద్దతుతో కృష్ణా జిల్లాకు చెందిన సుంకర రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న జోగయ్యశర్మ కర్నూలు జిల్లాకు చెందిన వారు. విజయవాడ బిజెపి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు.
పార్టీ సానుభూతిపరులతో కలసి ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. గతంలో పని జేసిన వారు సైతం బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్నారు. గంటా రామారావు, చితంబరం, ద్వారకనాథరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 107 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాదాపు 27 వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.