రాష్ట్రీయం

టీచర్ల బదిలీ వెబ్ ఆప్షన్ల షెడ్యూలులో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్రంలో టీచర్ల బదిలీ వెబ్ ఆప్షన్ల షెడ్యూలులో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఈ మేరకు వెబ్ ఆప్షన్ల తీరుతెన్నులపై 17 పేజీల పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ (పీపీటీ) ను విడుదల చేసింది. బదిలీల ప్రక్రియకు ఆన్‌లైన్‌లో ఎదురయ్యే ఇబ్బందులూ, వాటి పరిష్కారాలు, తరచూ తలెత్తే అనుమానాలు, వాటికి సమాధానాలను కూడా సూచించింది. ఈ పిపిటీతో చాలా వరకూ సమస్యలు పరిష్కారం అవుతాయని పాఠశాల విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీకి బదులు 21వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లను నిర్వహిస్తారు. టీచర్ల బదిలీల్లో భాగంగా కౌనె్సలింగ్ షెడ్యూలులో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అదర్ సిన్హా పేర్కొన్నారు. తుది అర్హుల జాబితా నుండి మొదలుకుని బదీలీల ఉత్తర్వుల జారీ వరకూ కొనసాగాల్సిన ప్రక్రియను ఒకరోజు పొడిగించింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈ నెల 19న ఆన్‌లైన్‌లో తుది అర్హుల జాబితాను ప్రకటించాల్సి ఉండగా, దానిని ఈ నెల 20న ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. అలాగే 20వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్లను 21వ తేదీ నుండి ప్రారంభిస్తామని వారు వివరించారు. టీచర్లు వెబ్ ఆప్షన్లను ఈ నెల 24వ తేదీ వరకూ ఇచ్చుకోవచ్చని వెల్లడించింది. 26వ తేదీన కమిటీ ఆమోదం కోసం బదిలీల జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని 27వ తేదీన బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించారు.