రాష్ట్రీయం

మంచం పట్టిన మల్లాపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 19: అనంతపురం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జనం విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలోని విడపనకల్లు మండలం పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గాజుల మల్లాపురం గ్రామంలో విష జ్వరాలతో మంచం పట్టారు. సుమారు 300 గడపలున్న ఈ గ్రామంలో గత 10 రోజులుగా జనాలు విపరీతమైన జ్వరం, కీళ్లనొప్పులు, కాళ్ల వాపులతో అల్లాడుతున్నారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా గ్రామస్థులు రోగగ్రస్తులయ్యారు. ఈ వింత అనారోగ్య పరిస్థితి ఏమిటో ప్రజలకు అంతుపట్టడం లేదు. 25 నుంచి 35 ఏళ్ల లోపు యువకులు మొదలు పిల్లలు, మహిళలు, వృద్ధులు బాధితుల్లో ఉన్నారు. గ్రామంలోని ఐదారు కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు రోగాల బారిన పడ్డారు. ఇది అంటువ్యాధిలాగా సోకుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఉరవకొండ, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాజుల మల్లాపురం గ్రామానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపానపోలేదు. ఈనెల 21, 22వ తేదీల్లో వివాహం చేసుకోబోతున్న ఓ యువకుడికి మంగళవారం కాళ్లవాపులు, కీళ్లనొప్పులు వచ్చాయని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు బాధితుల్లో నలుగురు పిల్లలు, 15 మంది దాకా మహిళలు ఉండగా, మిగతా వారు వృద్ధులు, యువకులు. ఇది చికున్‌గన్యా వ్యాధా, లేక వైరల్ ఫీవరా అన్నది అంతుపట్టడం లేదని గ్రామస్తులు వాపోయారు. భరించలేని నొప్పులతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నామని సీతారాముడు (35), బైరప్ప (75), చంద్రశేఖర్ (35), నెట్టెంరాజు (35) వాపోయారు.
నేడు వైద్య శిబిరం
గాజుల మల్లాపురంలో గ్రామంలో జనం రోగాల బారిన పడిన విషయాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్ దృష్టికి ఆంధ్రభూమి తీసుకెళ్లింది. గ్రామానికి ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ఎంఎన్‌ఏను పంపించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి రక్త నమూనాలు సేకరించారు. బుధవారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాల్లూరు పీహెచ్‌సీ డాక్టర్ శ్రీకాంత్ బాబు నేతృత్వంలో ప్రత్యేక వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్తున్నట్లు ఎంపీహెచ్‌ఈఓ జాఫర్ తెలిపారు.