రాష్ట్రీయం

మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 19: ప్రపంచ ప్రఖ్యాత ధ్వన్యనుకరుణ సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాదవ్ (86) మంగళవారం ఉదయం వరంగల్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేరెళ్ల వరంగల్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్‌కు భార్య శోభ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ధ్వన్యనుకరుణ విద్యకు కర్త, క్రియ తానే అయి దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఆయన వరంగల్ జిల్లా వాస్తవ్యులు. హైస్కూల్ విద్యను ఇక్కడే పూర్తి చేశారు. స్వయం కృషితో మిమిక్రీ విద్యను అభ్యసించి దానిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి అహరహం శ్రమించారు. ఈ క్రమంలోనే ఆయన మిమిక్రీ విద్యకు సిలబస్‌ను రూపొందించడంలో కీలకమైన పాత్ర నిర్వహించారు. నేరెళ్ల మృతిచెందిన వార్త వినగానే వరంగల్ నగరం నివ్వెరపోయింది. సీఎం కేసీఆర్ సహా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తోపాటు అనేకమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయగా డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, జిల్లా కలెక్టర్ అమ్రపాలి, ఎంపీలు బండా ప్రకాశ్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, మేయర్ నన్నపునేని నరేందర్, ప్రముఖ సినీ ఆర్టీస్ట్ వేణుమాదవ్, ఎమ్మెల్మేలు, స్థానిక నాయకులు, అధికారులు ఆయన పార్ధీవవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ బిడ్డగా డాక్టర్ నేరేళ్ల వేణుమాదవ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి రాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఐక్యరాజ్య సమితిలో మిమిక్రి ప్రదర్శించిన ఎకైక భారతీయుడిగా గుర్తింపుపొందారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేణుమాదవ్ పేరుతో స్టాంప్‌లను కూడా విడుదల చేసింది. 16 యేటనే డాక్టర్ వేణుమాదవ్ మిమిక్రి కేరీర్ ప్రారంభించారు. 2001లో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. ప్రముఖుల ద్వనీ అనుకరుణ చేసి ప్రశంసలు అందుకున్నారు. 1972-78 మద్య కాలంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా 12 సినిమాల్లో ముఖ్యపాత్ర పోషించారు. నేరేళ్ల పుట్టిన రోజును మిమిక్రి దినంగా ప్రకటించారు. ద్వనీ అనుకరుణలో దేశవీదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అనేక అవార్డులు అందుకున్నారు. తెలుగు యూనివర్సిటీలో మిమిక్రి కళాశాల అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు, హింది, ఇంగ్లీష్, ఉర్ధు, తమిళంలో పలు పురస్కారాలు అందుకున్నారు. కాగా ఆయన మరణనంతరం నేత్రాలను దానం చేశారు. కాగా ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం వరంగల్ నగరంలోని కొత్తవాడలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు జిల్లాలోని అన్ని వర్గలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనగా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.