రాష్ట్రీయం

పట్టిసీమతో రూ.18వేల కోట్ల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి/నూజివీడు , జూన్ 19: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గత మూడేళ్లలో రూ.18వేల కోట్ల విలువైన పంటను కాపాడగలిగామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట అక్విడెక్టు వద్ద పోలవరం కుడి కాలువ ద్వారా చేరుకున్న గోదావరి జలాలకు నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తొలి ఏడాది నాలుగు టీఎంసీలు, మరో మార్గంలో నాలుగు టీఎంసీలు మొత్తం 8.4 టీఎంసీల నీరు అందించి, రూ.2500 కోట్ల విలువైన పంటను కాపాడగలిగామన్నారు. రెండవ ఏడాది గన్నవరం, మైలవరం నియోజకవర్గాలతోపాటు కృష్ణా డెల్టాకు 55 టీఎంసీల నీరు అందించి రూ.ఐదు వేల కోట్ల విలువైన పంటను కాపాడగలిగామన్నారు. మూడవ ఏడాది గోపాలపురం, ఏలూరు, దెందులూరు, గన్నవరం, నూజివీడు, మైలవరం, ఉంగుటూరు నియోజకవర్గాలతోపాటు కృష్ణా డెల్టాకు 105 టీఎంసీల నీరు అందించామన్నారు. అందులో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు 90 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తీసుకువెళ్లామని, మరో 15 టీఎంసీలు పశ్చిమగోదావరి, కృష్ణా డెల్టాలో మెట్ట ప్రాంతాలకు అందించామన్నారు. దీని మూలంగా సుమారు పది వేల కోట్ల రూపాయల విలువైన పంటను కాపాడగలిగామని వెల్లడించారు. ఈ ఏడాది నాల్గవ విడతగా పట్టిసీమ నీటిని విడుదల చేశామన్నారు. ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపించారు.