రాష్ట్రీయం

పరామర్శలతో జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి గన్నవరం, జూన్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో సాగిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర 193వ రోజైన మంగళవారం కూడా కొనసాగింది. పాదయాత్ర పరామర్శలు, పలకరింపులు, వినతిపత్రాల స్వీకరణలకు పరిమితమయ్యింది. ఉదయం 9.00 గంటలకు పి గన్నవరంలో ప్రారంభమైన యాత్ర ప్రారంభమైన యాత్రకు డొక్కా సీతమ్మ వారిధి వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి అక్విడెక్టు మీదుగా లంకలగన్నవరం, మొండెపులంక, మల్లాయిపాలెం, కంధాలపాలెం వరకు పాదయాత్ర సాగింది. కందాలపాలెంలో జగన్ మధ్యాహ్న భోజనం చేసి విశ్రమించారు. అనంతరం పాదయాత్ర నాలుళ్ళంక, వాడ్రేవుపల్లి గ్రామాల పరిధిలో చాకలిపాలెం వరకు సాగింది.
దారి పొడవున పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. వారితో మాట్లాడుతో, సెల్ఫీలు దిగుతూ పాదయాత్రను కొనసాగించారు. లంకల గన్నవరానికి చెందిన యన్నాబత్తుల నాగరాజు, దొమ్మేటి సూర్య, యన్నాబత్తుల సూర్యచంద్రరావు తదితరులు తమ గ్రామంలో అనధికార ఇసుక ర్యాంపును మూడేళ్లు నిర్వహించి, కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కొందరు అధికారపార్టీ అండదండలతో దోచుకుపోయారని వివరించారు. దీనిపై విచారణ జరపించడానికి కృషిచేయాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొండెపులంక గ్రామానికి చెందిన గిడుగు రామకృష్ణను వైఎస్ జగన్ పరామర్శించారు.
జొన్నలంక గ్రామంలో మత్స్యకారులతో జగన్ ముచ్చటించారు. కొందాలపాలెం, నాగుల్లంక గ్రామాలలో మహిళలు, పిల్లలతో సెల్ఫీలు దిగుతు వారితో ముచ్చటించారు. పాదయాత్ర పొడవునా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చాకలిపాలెం గ్రామానికి చేరుకున్న అనంతరం 193వ రోజు ప్రజా సంకల్ప యాత్రకు జగన్ ముగింపు పలికి, శిబిరానికి చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ వెంట నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, జిల్లా పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిందుటుగుటి మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ళ వెంకటసాయిరామ్, మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.