రాష్ట్రీయం

కాబోయే ప్రధాని రాహుల్ గాంధే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48వ జన్మదిన వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి భారీ కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. గాంధీ భవన్ ఆవరణలో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ‘రాహుల్ గాంధీ జిందాబాద్, కాబోయే ప్రధాని రాహుల్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో రాహుల్ ఒకరని అన్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్ దేశాభివృద్ధి కోసం తపన పడుతున్నారని చెప్పారు. అటువంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ప్రధానిని చేయాలని, దీనికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులుగా చేయాలని ఉత్తమ్ కోరారు. దేశానికి ఎన్నో సేవలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ను ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఇతర నాయకులు కుమారరావు, నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ కుమార్, బొల్లు కిషన్, మీడియా కమిటీ కార్యదర్శి గోపి, సురేశ్, అధికార ప్రతినిధులు ప్రభృతులు పాల్గొన్నారు.