రాష్ట్రీయం

రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తెలియచెప్పడానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశం లభించకపోవడంతో ఓ రైతు కుటుంబం ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ముఖ్యమంత్రిని కలిసేందుకు సిబ్బంది నిరాకరించడంతో మంగళవారం ప్రగతి భవనం సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు ప్రయత్నిండంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే, తన కుటుంబానికి చెందిన ఆస్తిని మరొకరు ఆక్రమించారని, దాని విలువ సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని నల్లగొండ జిల్లాకు చెందిన నూకల వనమ్మ (55) కుటుంబం వాపోతున్నది. తిప్పర్తి మండలం సైలార్‌మియా గూడెంకు చెందిన ఆమె తన కుటుంబ సభ్యులతో మంగళవారం మధ్యాహ్నాం 1.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతి భవనం వద్దకు వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వారంతా అనుకున్నారు. కానీ, సీఎంను కలవడానకి వీల్లేదని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది చెప్పడంతో వారు అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించారు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వారికి నచ్చచెప్పి, అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు.