రాష్ట్రీయం

మా చావుకు కారణం వారిద్దరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: కుమార్తెలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న హన్మంతరావు తాము చనిపోయేందుకు ఇద్దరే కారణమని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తమ చావుకు ఇప్కో కిసాన్, రైతు సిమ్, పాన్‌కార్డు సెంటర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన ఆఫీస్‌లో జాబ్ చేసేందుకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన భాస్కర్ ఫోన్ నం. (8099515100), కొండపాక మండలం బందారం గ్రామా నికి చెందిన గుంగుల మమత ఫోన్ నం. (9182906094)లే తమ ఆత్మహత్యకు కారణమని రాశాడు. 7, 8నెలల్లో భాస్కర్, మమత 7.84లక్షలు తీసుకున్నారన్నారు. మమత 7.53లక్షలు తీసుకోగా, భాస్కర్ 35వేలు తీసుకున్నాడన్నారు. పైస్పులు ఇవ్వమంటే రేప్‌కేసు పెడుతామని బెదిరించినట్లు తెలిపాడు. 7.84లక్షల డబ్బుల్లో 2.80లక్షలు ఆఫీస్ అవౌంట్ కాగా, 7.04లక్షలు చిట్టీల ద్వారా తాను తెచ్చానని పేర్కొన్నారు. 3.92 లక్షలు చిట్టీ వేసి ఆఫీస్‌కు తెస్తే డబ్బులు కావాలని మమత గొడవ చేసినట్లు తెలిపాడు. అలాగే గజ్వేల్‌లో రిలయన్స్ సిమ్ రీచార్జ్ సెంటర్, సహారా షాపుల వల్ల సుమారు 4లక్షల వరకు అప్పులపాలైనట్లు తెలిపాడు. ఈ డబ్బు లు రాకపోవడంతో అప్పుల వారి వేధింపులు కారణమన్నాడు. భాస్కర్, మమతతో పాటు సిద్దిపేటకు చెందిన కనకయ్య, దుద్దెడకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌లు వేధింపులకు పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకుంటే కుమార్తెలను కిడ్నాప్ చేస్తామని బెదిరించినట్లు తెలిపాడు. ఈ నలుగురు చావుకు కారణమని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. మమత, భాస్కర్ దగ్గర అవౌంట్ రికవరీ చేసి తమ కంపెనీకి చెందిన ఎక్స్‌క్యూటీవ్‌లకు జీతా లు ఇవ్వాలని కోరాడు. ఎంత ఇవ్వాలో లిస్టు రాసినట్లు తెలిపాడు. మిగిలిన డబ్బులు తన అన్న పురుషోత్తంకు ఇవ్వాలని కోరాడు. తన వల్ల చాలా అప్పులైనాయి, ప్రజలకు ఇబ్బంది కలుగొద్దని పోలీసువారికి సూసైడ్‌నోట్‌లో కోరాడు.