రాష్ట్రీయం

విశిష్ట సంపద యోగా: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: ప్రాచీన కాలంలో భారత గడ్డపై పుట్టిన యోగా, నేడు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, కుల మతాలకు అతీతంగా యోగా విన్యాసాలు చేస్తూ అనేకమంది ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. జై భారత్ ఫౌండేషన్, తెలంగాణ యోగా ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, సిహెచ్ రాంచంద్రారెడ్డి, బీజేపీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ యోగా అనేది భారతీయుడి జీవన విధానంలో భాగమని, ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకి దక్కుతుందని అన్నారు.
యోగా భారత సంపద అని, అది శరీరాన్ని- మనస్సును ఏకం చేస్తుందని చెప్పారు.