ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మోటారు వాహనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్దే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తొలుత విశాఖ నుంచి ప్రారంభించారు. ర్వాత ఈ విధానాన్ని రాష్ట్రం అంతటా అమలు చేయనున్నారు. విశాఖలోని వరుణ్ మోటార్స్‌లో కేంద్రీయ విద్యాలయం విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పి ఈశ్వరశర్మ, శాంత దంపతులు ఒక వాహనం కొనుగోలు చేయగా, వాహనానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎపి 31 టిఆర్ 0001 నెంబర్‌ను కేటాయించారు. ఆన్‌లైన్ సేవలను విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి కొనుగోలుదారులైన శర్మ దంపతులతో నేరుగా సంభాషించారు. రవాణాశాఖలో సేవలను ఆన్‌లైన్ చేయడం ద్వారా పారదర్శకతతోపాటు మెరుగైన ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా సిఎం వివరించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించడం వల్ల దళారీ వ్యవస్థ బెడద కూడా ఉండదన్నారు. దేశంలోనే తొలి సారిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా చరిత్రలో రాష్ట్రం నిలుస్తుందని రవాణాశాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రవాణా శాఖలో 83 సేవలను ఇక మీదట ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

కొనుగోలుదారులను ముఖ్యమంత్రితో
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిస్తున్న రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, మంత్రి గంటా