రాష్ట్రీయం

నిబంధనలు జీవోలకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఇంజనీరింగ్ కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయించినట్టే మెరిట్ ఆధారంగానే యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలోనూ భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. పలుకుబడి ఉన్న కాలేజీలు రూల్స్‌ను తోసిరాజని ఇష్టారాజ్యంగా సీట్లను భర్తీ చేస్తున్నా, పట్టించుకునే నాధుడే లేడు. రాష్ట్రంలో 172 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా, అందులో పలుకుబడి ఉన్న కాలేజీలు సుమారు డజను. సహజంగానే విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి అంతా వాటిపైనే ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కోసం ప్రయత్నించి, ఆ సీట్లు రాకుంటే కనీసం ఈ డజను కాలేజీల్లో ఎక్కడో ఒక చోట చేరాలనే ఆతృతను ప్రదర్శించడంతో విద్యార్థుల బలహీనతతో ఈ కాలేజీలు ఆడుకుంటున్నాయి. ‘బీ’ కేటగిరి, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి పారదర్శకత పాటించాలని, దరఖాస్తు చేసేందుకు వీలుగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. అదే విధంగా, దరఖాస్తు చేసిన వారి జాబితానూ, అందులో తిరస్కరించిన వారి వివరాలను, మెరిట్ జాబితాను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. వాస్తవానికి చాలా కాలేజీలు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించడం లేదు. ఒకటి రెండు కాలేజీలు మాత్రమే ఈ జాబితాలను వెబ్ పోర్టల్‌లో ఉంచాయి. ఫీజును కూడా ప్రస్తావిస్తూ విద్యార్థులకు సూచనలు ఇచ్చాయి. మిగిలిన కాలేజీలు మాత్రం ఈ నిబంధనలు తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తున్నా ఇటు ఉన్నత విద్యామండలి, అటు ఫీజుల రెగ్యులేటరీ కమిటీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దురదృష్టకరం. వీటి ఉదాసీన వైఖరి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సీట్లు కావల్సిన వారికి బహిరంగంగానే డొనేషన్లు వసూలు చేస్తున్న ఈ కాలేజీలు అందుకు తగ్గ రసీదులు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడం లేదు. కేవలం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు రసీదులు ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నాయి. సీట్లు పొందడమే లక్ష్యంగా ఉన్న తల్లిదండ్రులు దీనిపై ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. ఎవరి దృష్టికైన తీసుకెళితే, సీట్లు కోల్పోవల్సి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై నెలల్లో జరిగే అడ్మిషన్ల సమయంలో ప్రకటనలు జారీ చేస్తున్న అధికారులు డిసెంబర్, జనవరి నెలల్లో ఈ జాబితాలను ఎలాంటి ఆటంకం లేకుండా రాటిఫై చేస్తున్నారు. రాటిఫికేషన్ సమయంలో ఇతర వివరాలు ఏవీ ప్రశ్నించకుండానే యాజమాన్యాలు సమర్పించిన జాబితాలకు ఆమోదం పలకడం వెనుక లక్షలాది రూపాయిలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ సీట్ల రాటిఫికేషన్‌లోనూ అనేక అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదులు అందుతున్నా, వౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందని వారు చెబుతున్నారు. నిజానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో 90 వేల వరకూ సీట్లు ఉండగా, అందులో కన్వీనర్ కోటా సీట్లు 69,946. అయినా వెబ్ ఆప్షన్లకు వచ్చింది 60,000 మంది మాత్రమే. 52,621 మందికి సీట్లు కేటాయించగా, ఇంత వరకూ రిపోర్టు చేసిన సంఖ్య 40,000లకు మించలేదు. ఒక కాలేజీలో అయితే ఒక్కరు కూడా చేరలేదు. రెండు కాలేజీల్లో చేరిన విద్యార్ధులు పదిలోపే. 20 కాలేజీల్లో 50లోపు విద్యార్ధులు చేరారు. 45 కాలేజీల్లో వందలోపు విద్యార్థులే చేరారు. దీంతో దాదాపు పాతిక కాలేజీలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.