రాష్ట్రీయం

బీసీలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: బడుగు, బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకే కాంగ్రెస్‌ను వీడినట్టు మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం నగరంలో ఇక్కడ మొదటి సారి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బలహీన వర్గాలకు చెందిన నేతగా తమ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయన్ని సరిచేయాలని ఎంతో ప్రయత్నించానని అన్నారు. అయితే, అది సాధ్యపడలేదని ఆదివారం టీఆర్‌ఎస్ చేరుతున్నానని దానం నాగేందర్ అన్నారు. గత నాలుగేళ్లుగా క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడకుండా ఎంతో ప్రయత్నం చేశానని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్న సమయంలో, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు తెలియకుండా కార్పొరేటర్ తదితరు స్థానాలకు టికెట్లు నేరుగా ఇచ్చేయడం తనను విస్మయానికి గురిచేసిందని అన్నారు. అనేక రకాలుగా పార్టీలో తాను ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. 70 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో వివిధ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు జాతీయ నేతలను కోరినట్టు చెప్పారు. పార్టీలో ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారని, మొదటి నుంచి పార్టీ జెండాలు మోసిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీకి వెళ్లి వచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి పదవులు లభిస్తున్నాయే తప్ప పార్టీని నమ్ముకొన్న వారికి ఎలాంటి గుర్తింపు రావడం లేదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచి వాడని, అయితే, ఆయ న ఒక జాబితాతో ఢిల్లీకి వెళితే, మరుసటి రోజు వేరొక జాబితాతో కొంత మంది నేతలు ఢిల్లీ బాటపట్టడం విచారకరమని అన్నారు. గాంధీ భవన్‌లో ఏం జరుగుతుందో పీసీసీ అధ్యక్షుడికి తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో 256 బీసీ కులా లు, సుమా రు మూడు కోట్లకు పైగా జనాబా ఉన్నా సామాజిక వర్గాలకు పార్టీ న్యాయం చేయలేకపోయిందన్నారు. ప్రస్తుతం పార్టీ లో కొనసాగుతున్న హనుమంతరావులాంటి వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌లా కేసీఆర్ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని అన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని దానం నాగేందర్ తెలిపారు.