రాష్ట్రీయం

జగన్ యాత్రకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, జూన్ 23: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు శనివారం ఉదయం కురిసిన వర్షం ఆటంకం సృష్టించింది. దీంతో ఆయన పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన వేదాది మంది కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన జగన్ రాజోలులోని చింతపల్లి శిబిరంలో బసచేసారు. శనివారం ఉదయం పాదయాత్ర ఉంటుందని భావించిన రాజోలు నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు చింతపల్లిలోని జగన్ బసచేసిన ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకూ వర్షం కురవడంతో కార్యకర్తలు వర్షంలో తడిచి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. వాతావరణం అనుకూలిస్తే మధ్యాహ్నం పాదయాత్ర ఉంటుందని చెప్పడంతో కార్యకర్తలను నిరాశతో వెనుదిరిగారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో మద్యాహ్నం 3.00 గంటల నుండి చింతలపల్లి నుండి కూనవరం, ములికిపల్లి వరకు పాదయాత్ర చేశారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. బుడగా జంగాల సంఘం నాయకులు జగన్‌కు తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. అలాగే ములికిపల్లి సెంటర్‌లో ఆయనను చూసేందుకు చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగపడ్డారు. జగన్ ప్రజలకు అభివాదం తెలుపుతూ ములికిపల్లి వరకు పాదయాత్ర సాగించారు. పాదయాత్ర సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వివరిస్తూ జగన్ వెంట నడిచారు. అయితే వర్షం కారణంగా పాదయాత్ర ఉంటుందా లేదా అని చాలా మంది కార్యకర్తలు రాకపోవడంతో స్థానిక గ్రామాలకు చెందిన ఎక్కువ మంది ప్రజలకు జగన్‌ను కలిసే అవకాశం లభించింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో రాజోలు మండలం ములికిపల్లి నలందా పాఠశాల ఆవరణలో శనివారం రాత్రి బస చేశారు. ఆదివారం ములికిపల్లి నుండి పాదయాత్ర ప్రారంభమై కడలి, వేగివారిపాలెం, గెద్దాడ మీదుగా తాటిపాక చేరుకుంటుందని రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరావు తెలిపారు.
ఒలింపిక్ డే రన్‌ను ప్రారంభించిన జగన్
ఒలింపిక్ డే రన్‌ను రాజోలు మండలం చింతపల్లిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రారంభించారు. శనివారం ఉదయమే ప్రజా సంకల్ప యాత్రకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఒలింపిక్ రన్ పేరుతో 13 జిల్లాల నుండి వచ్చిన వివిధ పాఠశాల విద్యార్ధులు వర్షంలో తడుస్తూ జగన్ కోసం ఎదురు చూసారు. అయితే వర్షంలో తడుస్తున్న ఒలింపిక్ క్రీడాకారులను చూసిన జగన్ జ్యోతి వెలిగించి ఒలింపిక్ రన్‌ను ప్రారంభించారు. అనంతరం పాదయాత్రను వాయిదా వేశారు.