రాష్ట్రీయం

ఇండోనేషియాకు ఈఎన్‌సీ నౌకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 23: మలబార్ -18 ఎక్సర్‌సైజ్ ముగించుకుని ఇండోనేషియాకు తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) యుద్ధ నౌకలు పయనమయ్యాయి. ఈఎన్‌సీకి చెందిన ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ కమోర్తా ఇండోనేషియాలోని మకస్సర్ పోర్టుకు చేరుకున్నాయి. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా భారత నౌకాదళం వివిధ దేశాల నౌకాదళాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఈఎన్‌సీకి చెందిన రియర్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి సారథ్యంలో కమోర్తా, శక్తి యుద్ధ నౌకలు మకస్సర్ పోర్టుకు చేరుకున్నాయి. పోర్టులో విడిది చేసిన ఈఎన్‌సీ నౌకల సందర్శనకు ఇండోనేషియా ప్రజలను అనుమతించనున్నారు. రెండు దేశాల నౌకాదళాల మధ్య క్రీడా, సాంస్కృతిక, నౌకాదళ సంబంధాలపై సమగ్ర విశే్లషణ జరగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల నౌకాదళాల నడుమ సత్సంబంధాలు, ఇతర అంశాల్లో అవగాహనకు ఈ సందర్శన దోహదపడుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది మే 29న ఇండోనేషియా సందర్శించారు. ప్రస్తుతం ఈఎన్‌సీ నౌకలు మకస్సర్ పోర్టు సందర్శనతో రెండు దేశాల నౌకాదళ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఐఎన్‌ఎస్ శక్తి (్ఫ్లట్ ట్యాంకర్), ఐఎన్‌ఎస్ కమోర్తా యుద్ధ నౌకలు సౌత్ ఈస్ట్ ఆసియా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న విన్యాసాల్లో పాల్గొంటూ వస్తున్నాయి. ఇటీవల భారత్, యూఎస్, జపాన్ దేశాలు మలబార్-18 ఎక్సర్‌సైజ్ పేరిట నిర్వహించిన త్రైపాక్షిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. గత రెండు నెలలుగా ఐఎన్‌ఎస్ శక్తి, కమోర్తా యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సహ్యాద్రితో కలిసి పలు విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాంలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.