ఆంధ్రప్రదేశ్‌

వీఐపీల ప్రాపకానికే రమణ దీక్షితులు పాకులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు ధనవంతులైన భక్తుల ప్రాపకం కోసమే అహర్నిశలు పనిచేశారని, ఎన్నో అపచారాలకు కేంద్రబిందువుగా మారారని బ్రాహ్మణ చైతన్య వేదిక ఏపీ కో-కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు. ఆదివారం గుంటూరులోని వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి పాదసేవకు పరిమితం కావాల్సిన రమణ దీక్షితులు ధనవంతులైన వీఐపీలకు టీటీడీ తరఫున యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తానని లేఖలు సైతం పంపేవారన్నారు. దీనికి సంబంధించి మహారాష్టల్రోని నాందేడ్ పట్టణంలో ఒక వీఐపీ వద్దకు వెళ్లిమరీ యజ్ఞం చేసి, స్వామివారికి 33 వెండి బిందెలు అవసరమని చెప్పి తన ఇంటికి తరలించుకున్న ఘనత రమణ దీక్షితులుదని ఆరోపించారు. ఈవిషయమై అప్పట్లో సాక్ష్యాధారాలతో సహా సంబంధిత వీఐపీ అప్పటి టీటీడీ ఈవో బలరామయ్యకు ఫిర్యాదు చేశారని, విచారణ అనంతరం రమణ దీక్షితులు చేసింది తప్పేనని నాడు నిర్థారించారని పేర్కొన్నారు. వెయ్యికాళ్ల మంటపం తొలగింపు ప్రతిపాదనలో ఆగమ సలహా కమిటీలో రమణ దీక్షితులది రెండో సంతకమన్నారు. హైదరాబాద్‌లో అతిథిగృహం నిర్మించి హిందుజా సంస్థ ద్వారా ఒకరికి అద్దెకిచ్చారని అన్నారు. రమణ దీక్షితులుపై ఇప్పటివరకు టీటీడీ విజిలెన్స్ అధికారుల వద్ద 200కు పైగా ఫిర్యాదులు ఉన్నాయన్నారు.