రాష్ట్రీయం

ఇక నామినేటెడ్ పదవుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆంధ్రలోని నామినేటెడ్ పదవుల పందేరానికి సిఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న చంద్రబాబు ఎట్టకేలకు 8 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా జయరామిరెడ్డిని నియమించారు. అలాగే ఇటీవలే ప్రారంభించిన కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా చలమలశెట్టి రామాంజనేయులును నియమించారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌కు లింగారెడ్డిని, హౌసింగ్ కార్పొరేషన్‌కు వర్ల రామయ్యను, ఎస్సీ కార్పొరేషన్‌కు జూపూడి ప్రభాకర్‌ను, మహిళా కార్పొరేషన్‌కు పంచుమర్తి అనురాధను, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ను నియమించారు. మిగిలిన కార్పొరేషన్ పదవులకు సైతం పేర్లను ఖరారు చేశారు. అవి ఇంకా వెలువడాల్సి ఉంది.