రాష్ట్రీయం

ముందస్తుకు కేసీఆర్ సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ముందస్తు ఎన్నికలకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకేతం ఇచ్చారు. ‘మాకే బాగుంది... మాకే బాగుంది అని అంటున్నారు.. పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉందో ప్రజలే తేలుస్తారు, ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం. మీరూ సిద్ధమేనా’ అని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సీఎం సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రి సమక్షంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మంచి పనులు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ‘ఇదంతా అవసరమా? ఈ గోలంతా ఎందుకు? మీరు సరే అంటే ముందస్తు ఎన్నికలకు పోదామా అని నేనే అడుగుదామనుకుంటున్నా. మా పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు’ అని కాంగ్రెస్‌కు నిలదీశారు. ‘నా లెక్క ప్రకారం కూడా ముందస్తు ఎన్నికలు రావొచ్చని అనుమానంగా ఉంది’ అంటూ కేసీఆర్ ‘ముందస్తు’ గురించి కేసీఆర్ చెప్పకనే చెప్పారు. మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎప్పటికీ వదులుకోరని అన్నారు. ఒడిశాలో వరుసగా నాలుగు సార్లు ఒకే పార్టీ గెలిచిందని, అదే విధంగా మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు మరోపార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలతో తన ప్రభుత్వం ప్రజల మనసు దోచుకుందన్నారు. యావన్మంది ఆశ్చర్యపడే రీతిలో పరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతోన్న మంచి పనులను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేసారు. నీటి ప్రాజెక్టులకు అడ్డగోలుగా అడ్డం పడుతున్నాయని విమర్శించారు. ఒక నాయకుడు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు చూసి ఓర్వలేక ఇంత పెద్ద ప్రాజెక్టు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారు కూడా పార్టీలు పెట్టడం దౌర్భగ్యమని సీఎం మండిపడ్డారు. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ నేతలు కలలుగంటున్నారని, ఆ పార్టీకి రాష్ట్రంలో ఏపాటి బలం ఉందో తెలియదా అని సీఎం ఏద్దేవా చేసారు. తాజా సర్వేలో కూడా టీఆర్‌ఎస్ వందకుపైగా సీట్లు గెలుచుకుంటుందని వచ్చిందన్నారు. రెండు మూడు రోజులలో తానే ఈ వివరాలు మీడియాకు వెల్లడిస్తానన్నారు. 82 స్థానాలలో 60 శాతానికిపైగా, వంద స్థానాలలో 50 శాతానికిపైగా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వస్తాయని ఆ సర్వే స్పష్టం చేస్తున్నదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో టీఆర్‌ఎస్ అభ్యర్థి 60-70 వేల భారీ మెజార్టీతో గెలువబోతున్నారని సిఎం జోస్యం చెప్పారు.

చిత్రం..దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్