ఆంధ్రప్రదేశ్‌

బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరంగిపురం: ఉరి వేసుకుని బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఫిరంగిపురంలో సంచలనం రేకెత్తించింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలోని సెయింట్ జేవియర్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా, అంబుదూర్ మండలం, కూరాకుల గ్రామానికి చెందిన మల్లవరపు సుమలత (21) బుధవారం తెల్లవారు ఝామున ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తను ఉంటున్న సెకండ్ ఫ్లోర్ నుండి ఖాళీగా ఉంటున్న 3వ ఫ్లోర్‌కు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆనందరావు సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహశీల్దార్ శ్రీనివాసులు, ఎండిఒ శ్యామలాదేవితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఃవిద్యార్థిని సుమలత ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని, హాస్టల్‌లో ఆహార పదార్థాలు అధ్వానంగా ఉంటున్నాయని, వసతులు కూడా సరిగా ఉండటం లేదని కళాశాల యాజమాన్యానికి ఎన్నోసార్లు చెప్తే వారు టిసి ఇచ్చి పంపుతామని బెదిరిస్తున్నారని విద్యార్థులు నన్నపనేని రాజకుమారి ఎదుట వాపోయారు. సంఘటనపై ఆమె పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేస్తామని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆనందరావు తెలిపారు.

సాగర్ కుడికాలువకు నీరు విడుదల
విజయపూరి సౌత్, మార్చి 2: నాగార్జుసాగర్ ఆయకట్టు పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి అవసరాలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా బుధవారం రాత్రి నీటిని విడుదల చేశారు. మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చటంతో జిల్లా అధికార యంత్రాంగం కృష్ణా రివర్ బోర్డుకు విన్నవించుకుంది. మంచినీటి ఎద్దడి నివారణకు ఆరు టిఎంసిల నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గంటకు వెయ్యి కూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. మరో 2వేల నుండి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం 508.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 128.4669 టిఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 917 క్యూసెక్కుల నీరు మంచినీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలుపుదల కారణంగా సాగర్‌లో విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 821.60 అడుగుల వద్ద కొనసాగుతోంది.