ఆంధ్రప్రదేశ్‌

బాబుది రాజకీయ వ్యభిచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో మరో మూడేళ్లపాటు యథేచ్ఛగా అధికారంలో కొనసాగేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ శాసనసభలో 88 సీట్లు అవసరం కాగా మిత్రపక్ష బిజెపి నల్గురు సభ్యులు, మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులతో కల్సి అధికార వర్గ టిడిపికి 106 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ సిఎం చంద్రబాబు మాత్రం బరితెగించి వలసలను పోత్స్రహిస్తూ నగ్నంగా నడిరోడ్డుపైనే రాజకీయ వ్యభిచారం సాగిస్తున్నారంటూ పిసిసి అధికార ప్రతినిధి డా.ఎన్.తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి దగాకోరులను దృష్టిలో ఉంచుకుని భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకుకై తక్షణం ప్రస్తుతం ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సి ఉందన్నారు. పిసిసి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత రాజీవ్ గాంధీ హయాంలో తొలిసారిగా చట్టసభల్లో మూడోవంతు సభ్యులు కాకుండా ఏ ఒక్కరు తగ్గినా ఫిరాయింపుదారులందరూ అనర్హులయ్యేలా ఎంతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. దీని ప్రకారం వైకాపాకు ఉన్న 67 మంది సభ్యుల్లో కనీసం 41 మంది ఫిరాయిస్తేనే చెల్లుబాటు అవుతుందన్నారు. అలాంటిది ఆరేడుగురు ఫిరాయించినా వీరి సభ్యత్వం రద్దు కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతూ నిస్సిగ్గుగా చట్టాలను ఉల్లంఘిస్తుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడగలరని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఇక స్పీకర్ కూడా బాబు చేతిలో కీలుబొమ్మ అయినందున ఈ చట్టాన్ని సవరించి ఫిరాయింపు చట్టాన్ని పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్ లేదా నేరుగా న్యాయస్థానానికే అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. ఫిరాయించేవారు తమను గెలిపించిన పార్టీని, కార్యకర్తలను విస్మరించి బాబు చేపట్టే అభివృద్ధిని చూసి వలస వస్తున్నామన్న తీరు చూస్తుంటే వెనకటికెవరో చెప్పినట్లు ‘తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే కల్లుకోసం అని చెప్పక దూడ గడ్డి కోసం’ అన్నట్లు ఉందన్నారు. బాబు వ్యవహార శైలి చూస్తుంటే టిడిపిలో దివంగత ఎన్టీఆర్ పాత్ర సతీ అనసూయ, సావిత్రి అయితే బాబుది చింతామణి పాత్రగా కన్పిస్తుందంటూ ఎద్దేవా చేశారు. టిడిపి ఆవిర్భావ సమయంలో తొలిగా కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆదెయ్య, నారాయణ, రత్తయ్యలు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకపోవటంతో ఎన్టీఆర్ ఏ మాత్రం వెరువక ఆ ముగ్గురిని ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేశారంటూ గుర్తు చేశారు. ఇక చంద్రబాబు చెబుతున్నట్లుగా వచ్చే ఎన్నికలు ఎటూ ఒన్‌సైడ్‌గా జరుగుతాయి. అవీ కాంగ్రెస్‌కు అనుకూలంగా అని అన్నారు. అది ఎలాయని ప్రశ్నిస్తే ఎమర్జెన్సీ కారణంగా 1977లో ఉన్న ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘోరపరాజయం పొందింది అయితేనేమి 1980 ఎన్నికల్లో కేవలం జనతా ప్రభుత్వ వైఫల్యాల వల్ల విజయకేతనం ఎగురవేయలేదాయని ప్రశ్నించారు. అలాగే కేవలం రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందినప్పటికీ టిడిపి అసమర్థపాలన వైఫల్యాలు, అవనీతి కార్యకలాపాలు, అన్నింటిని మించి మిత్రవర్గ బిజెపి కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా తెచ్చుకోలేని స్థితి. ఇక ప్రతిపక్ష వైకాపాలో అభద్రతా భావం, అనుభవ అవగాహన రాహిత్యం వీటిన్నంటి వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం చేకూరగలదన్నారు. పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి ఎస్.శైలజానాథ్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో ఢిల్లీ చుట్టూ ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ తీరా మోది వద్ద సాష్టాంగ ప్రమాణం చేస్తూ వస్తున్నందున విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చడం లేదన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రరావు ఈ విషయంలో చంద్రబాబును యూజ్‌లెస్ సిఎంగానే అభివర్ణించారు గాని దూషించలేదన్నారు. ఆయన విమర్శలకు సవాల్‌గా స్వీకరించడం మినహా ప్రత్యారోపణలకు దిగడం సరికాదన్నారు.
విలేఖర్ల సమావేశంలో పిసిసి కార్యనిర్వాహక కార్యదర్శి నీలం డొమెనిక్, నగర కాంగ్రెస్ ఎస్‌సి సెల్ ఛైర్మన్ సొంగా రాజ్‌కమల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.