రాష్ట్రీయం

నిమిషం కాదు.. 5 నిమిషాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు తీపి కబురు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పిన అధికారులు ఆ నిబంధనను సడలించారు. ‘ఒక్క నిమిషం’ నిబంధనతో పలువురు విద్యార్ధులు పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడటంతో ఆ నిబంధనను తొలగించి పరీక్ష ప్రారంభం అయిన ఐదు నిమిషాల వరకూ అనుమతించనున్నట్టు ఇరు బోర్డులకు చెందిన అధికారులు ప్రకటించారు. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్ధులు కుదుటపడ్డారు. ఈ అంశంపై ఆంధ్రా ఇంటర్ బోర్డు స్పష్టమైన ప్రకటన చేసినా, తెలంగాణ బోర్డు ప్రకటన జారీ చేయాల్సి ఉంది. మరో పక్క గురువారం నాడు రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో 3వ తేదీన జరిగిన సెకండ్ లాంగ్వేజి పేపర్ -2కు సెట్ బి ఎంపిక చేసినట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ చెప్పారు. మొత్తం 3,97,668 మంది జనరల్, 28,075 మంది వొకేషనల్ అభ్యర్ధులు కలిపి 4,25,743 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో 94.56 శాతం మంది మాత్రమే పరీక్షలు రాశారు. అన్ని జిల్లాలకు ప్రత్యేక పరిశీలకులను పంపించడంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అశోక్ వివరించారు. కాగా హైదరాబాద్‌లో ఇద్దరు విద్యార్ధులపై గురువారం నాడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 98,207 మంది విద్యార్ధులకు గానూ 95,683 మంది హాజరయ్యారు. జిల్లా స్థాయి స్క్వాడ్ అధికారులు 38 కేంద్రాలను గురువారం నాడు సందర్శించారు. కాగా హైదరాబాద్ జిల్లాలో 189 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 66870 మంది అభ్యర్ధులు హాజరుకావల్సి ఉండగా, 64,849 మంది పరీక్ష రాశారు. 2021 మంది గైర్హాజరయ్యారు. రెండు మాల్ ప్రాక్టీసు కేసులను నమోదుచేశారు. హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీ, స్క్వాడ్ బృందాలు కలిపి మొత్తం 36 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి.
ఆంధ్రాలో...
ఆంధ్రప్రదేశ్‌లో సెకండియర్ పరీక్షలకు 4,42,523 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 4,30,108 మంది హాజరయ్యారని కార్యదర్శి ఎం. వి. సత్యనారాయణ తెలిపారు. 12,415 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారని వివరించారు. గురువారం నాటి పరీక్షలో ఎవరిపైనా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేయలేదని ఆయన వివరించారు.