రాష్ట్రీయం

తెలంగాణ చరిత్ర తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కొత్త రిక్రూట్‌మెంట్లకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రధానంగా తొలుత గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయాలని తర్వాత గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే జూన్ నాటికి ఉన్న ఖాళీల స్థితిని నవీకరించి తర్వాత నోటిఫికేషన్లు జారీకి వీలుగా సన్నద్ధమవుతోంది. ఇందుకోసం వివిధ క్యాటగిరి పోస్టులకు కొత్త సిలబస్‌ను ప్రకటించింది. గత నెల రోజులుగా అభ్యర్ధులు కొత్త సిలబస్‌పై అభిప్రాయాలను తెలుపుతునే ఉన్నా గడవును మార్చి 10 నుండి 15వ తేదీ వరకూ పొడిగించినట్టు చైర్మన్ ఆచార్య పి ఉదయ భాస్కర్ తెలిపారు. గ్రూప్-1కు ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను కొత్తగా చేసిన మార్పులను మొత్తం 23 పేజీల ముసాయిదాను విడుదల చేశారు. అలాగే గ్రూప్-2 సర్వీసులకు 11 పేజీలు, గ్రూప్-4 సర్వీసులకు నాలుగు పేజీల ముసాయిదాలను విడుదల చేశారు.
కొత్త సిలబస్‌లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని పూర్తిగా తొలగించారు. కేవలం ఆంధ్రా ప్రాంత అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, రాష్ట్రంలో ఏకపార్టీ పాలనకు ఫుల్‌స్టాప్ పడిన తీరు, ప్రాంతీయ పార్టీలతో దేశంలో వచ్చిన మార్పులు, డ్వాక్రా గ్రూప్‌లు, సూక్ష్మ రుణ పథకాలు, ప్రభుత్వ పథకాలు కొత్తగా సిలబస్‌లో చేరాయి. గ్రూప్-1కు ప్రిలిమినరీ పరీక్ష లో జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ ఉంటాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లీషు అర్హత పరీక్షతో పాటు ర్యాంకులు కేటాయించేందుకు ఐదు పేపర్లు ఉంటాయి. తొలి పేపర్ జనరల్ ఎస్సే, రెండో పేపర్ సెక్షన్-1 కల్చర్ హెరిటేజ్, సెక్షన్-2లో సోషల్ కల్చరల్ హిస్టరీ, సెక్షన్-3లో ఇండియన్ కానిస్టిట్యూషన్, పేపర్-3లో సెక్షన్-1లో ప్లానింగ్ ఇన్ ఇండియా, సెక్షన్-2లో ల్యాండ్ రిఫార్మ్సు, సెక్షన్-3లో ఎపి ఎకానమి, పేపర్-4లో సెక్షన్ -1లో రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్షన్-2లో లైఫ్ సైనె్సస్, సెక్షన్-3లో డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్, పేపర్-5లో డాటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఉంటాయి.
ఇక గ్రూప్-2లో మూడు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ, ప్లానింగ్ ఇన్ ఇండియా, గ్రూప్-4కు రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ మీద, రెండోది సెక్రటేరియల్ అబిలిటీస్ మీద ఉంటాయి.
తెలంగాణ సిలబస్‌ను తొలగించి ఆంధ్రా సిలబస్‌ను పెంచడం మినహా పెద్దగా మార్పులు లేవని, కనుక అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎపిపిఎస్‌సి చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. గతంలో ఉన్న వాటినే కాస్తా వేరు చేసి ప్రత్యేక యూనిట్లుగా కూడా పొందుపరిచారు.