తెలంగాణ

ఆస్ట్రేలియా మహిళ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం ఆస్ట్రేలియాకు చెందిన లిండా మార్గరెట్ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో బెడ్‌పై ఆమె మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించిన ఆమె స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత నెల 15న ఆమె టూరిస్టు వీసాపై నగరానికి వచ్చారు. ఇక్కడ ఆమె నైజీరియన్లతో కలసి ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో లిండా మార్గరెట్ స్నేహితులు ఇంటికి వచ్చే సరికి ఆమె అనుమానాస్పద స్థితిలో బెడ్‌పై మృతి చెంది ఉంది. సంఘటన స్థలంలో ఆస్తమాకి సంబంధించిన టాబ్లెట్లు, డ్రగ్స్ టాబ్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆమె గత కొంత కాలంగా ఆస్తమాతో బాధ పడుతున్నట్లు ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు గోల్కొండ పోలీసులు తెలిపారు.

బిఆర్‌ఎస్‌పై
మధ్యంతర
ఉత్తర్వుల కొనసాగింపు
విచారణ నాలుగు వారాలకు వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకంపై (బిఆర్‌ఎస్) గతంలో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్టు హైకోర్టు గురువారం ప్రకటించింది. బిఆర్‌ఎస్ పథకాన్ని సవాల్ చేస్తూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరపున పద్మానాభరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోంస్లే, జస్టిస్ నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే పిటిషన్‌పై గతంలోనే హైకోర్టు స్పందిస్తూ తుది తీర్పు ఇచ్చే వరకు బిఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వరాదని, అయితే దరఖాస్తులను మాత్రం స్వీకరించవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు అభ్యంతరం చెప్పడంతో బిఆర్‌ఎస్ పథకాన్ని అమలు చేయడానికి జిహెచ్‌ఎంసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. జిహెచ్‌ఎంసి జారీ చేసిన జీవో స్థానంలో ఆర్డినెన్స్ తీసుకురావడంతో అంతకుముందు జారీ చేసిన జీవోను ఎందుకు రద్దు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ వివరణ కోరుతూ ఈ కేసును గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిందే. దీనిపై వివరణ ఇవ్వడానికి తమకు కొంత వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరగా, నాలుగు వారాల పాటు గడువు ఇస్తూ, గతంలో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు యధాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.