రాష్ట్రీయం

వీబీఐటీకి నేక్ అక్రిడిటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ కాలేజీల్లో ఈ ఏడాది నేక్ అక్రిడిటేషన్‌లో అత్యధిక పాయింట్లతో విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ) అగ్రస్థానంలో నిలిచిందని, తొలిసారే నేక్ అక్రిడిటేషన్‌కు వెళ్లడం 4 పాయింట్ల స్కేల్‌పై 3.23 పాయింట్లు సాధించి తెలంగాణలో ముందంజలో నిలిచిందని సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎన్ గౌతం రావు, డాక్టర్ జీ మనోహర్‌రెడ్డి చెప్పారు. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ -నేక్ నవీకరించిన మార్గదర్శకాలతో ఈ ఏడాది 89 కాలేజీలు దరఖాస్తు చేస్తే తెలంగాణలో రెండు కాలేజీలు మాత్రమే ఏ గ్రేడ్ సాధించాయని అందులో అత్యధిక పాయింట్లు తమ కాలేజీకే వచ్చాయని వారు చెప్పారు. దీనికి కారణం విద్యాత్మక అంశాల్లో అగ్రస్థానంలో ఉంటూనే మరో పక్క జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనడం, సామాజిక కార్యక్రమాలు, తొలి ఏడాది నుండే కౌశలాలు నేర్పించడం, విద్యార్ధి కార్యకలాపాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారిని పలు అంశాల్లో తర్ఫీదు ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించడం వంటి అనేక చర్యలు చేపట్టామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అమరేందర్ , వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జయంత్ కులకర్ణి చెప్పారు. నేక్ అక్రిడిటేషన్‌తో పాటు ఎన్‌బిఎ అక్రిడిటేషన్ కూడా రెండో మారు తమ సంస్థకు దక్కిందని, ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ సెల్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.