రాష్ట్రీయం

హైదరాబాద్ నలుదిక్కులా ఐటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐటీ పరిశ్రమను హైదరాబాద్ నగర నలు దిశల విస్తరించనున్నట్టు ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ఐటీ క్లస్టర్లకు అదనంగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. నగరంలో ఐటీ రంగం విస్తరణ, భవిష్యత్ వ్యూహానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ ఎగుమతుల విలువ లక్ష కోట్లకు చేరుకుంటుందని మంత్రి వివరించారు. పెరిగిన ఎగుమతులకు అనుగుణంగా ఐటీ పరిశ్రమకు నగరంలో వౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, ఆర్ అండ్ బీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రోరైలు తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి చర్చించారు. నగరంలో ఐటీ పరిశ్రమ ఇప్పటికే విస్తరించి ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనకు స్వల్పకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. వీటితో పాటు రాజేంద్రనగర్, బుద్వేల్‌లో త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ క్లస్టర్లకు అన్ని వసతులను కల్పించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న క్లస్టర్లతో పాటు విస్తరించబోయే క్లస్టర్లకు రోడ్లు విస్తరణ, మురికి కాలువల నిర్మాణం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపైనా పూర్తిస్తాయి కార్యాచరణ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల విస్తరణకు ప్రవేశపెట్టిన విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు.
వచ్చే ఐదు సంవత్సరాలలో లక్షలాది ఉద్యోగాలు ఐటీ రంగంలో రాబోతున్నయన్నారు. అయితే ఈ అవకాశాలు నగరంలో ఒకవైపునకే కాకుండా నలు దిశల రావాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్య వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఐటీ పరిశ్రమలు విస్తరించే ప్రాంతాలలో పోలీసు స్టేషన్లు ఫైర్ స్టేషన్లు, మెట్రోరైలు సదుపాయం వంటి వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజేందర్‌నగర్ వద్ద ఏర్పాటు చేయాల్సిన ఐటీ క్లస్టర్‌కు భూ సేకరణకు రెవిన్యూ శాఖ తీసుకున్న చర్యలపై మంత్రి ఆరా తీసారు.