రాష్ట్రీయం

అడ్వాన్సుగా నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 11: నిర్ణీత కాలవ్యవధిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావాలంటే అవసరమైన నిధులు కేంద్రం ముందుగానే మంజూరుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తంలో మంజూరుచేయాల్సిన నిధులతోపాటు, కొత్త డీపీఆర్ మేరకు రూ.10వేల కోట్లు ముందుగా మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి మూడు అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు-2 (డీపీఆర్-2)కు సాధ్యమైనంత త్వరగా అనుమతి మంజూరుచేయడం, సహాయ పునరావాస పథకాల అమలుతో పాటు పనులు త్వరితగతిన కొనసాగించడానికి ముందస్తుగా నిధుల మంజూరు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని బుధవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాం జెట్ గ్రౌటింగ్ పూర్తయ్యిందని, లోయర్ కాఫర్ డ్యాం జెట్ గ్రౌటింగ్ పనులు 82 శాతం పూర్తయ్యాయని సీఎం తెలిపారు. 1115.6 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్‌కు అప్పట్లో 762.12 లక్షలు పూర్తికాగా,ప్రస్తుతం 842.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయ్యిందన్నారు. మొత్తంమీద 76.04 శాతం ఎర్త్‌వర్క్ పూర్తయ్యిందన్నారు.ప్రాజెక్టు రేడియల్ గేట్లు 18,800 మీటర్ల పనులకు గాను గతంలో 974 మీటర్లు పూర్తికాగా, ప్రస్తుతం 11,540 మీటర్లు పూర్తయ్యిందన్నారు. కేంద్రం కొత్తగా చేసిన భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం ఇంతలింతలుగా పెరిగిందన్నారు. ఒక్క భూసేకరణ, సహాయ పునరావాసాలకే సుమారు రూ.33వేల కోట్లు ఖర్చవుతోందన్నారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్నవారిలో ఎక్కువ శాతం గిరిజనులే ఉన్నారన్నారు. 2019 ఏప్రిల్ నాటికి సివిల్ పనులన్నీ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం స్పష్టం చేశారు. ఫిబ్రవరి లోపు పూర్తిచేయాలని కేంద్ర మంత్రి సూచిస్తున్నందున అందుకు కృషిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.14,141 కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుచేశామన్నారు. ‘స్ట్ఫా వర్కు’ ఉత్తర్వులపై కేంద్రం ఇచ్చిన స్టేను నిరంతరాయంగా కొనసాగిస్తూ, ఆ ఉత్తర్వులు రద్దుకు కృషిచేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు. విజయవాడ నుండి హెలికాప్టర్లో నేరుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత అధికార్లతో కలిసి పనులను పరిశీలించారు.