రాష్ట్రీయం

పెరుగుతున్న గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 11: గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రానికి 30.4అడుగుల నీటి మట్టం చేరింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం దిగువున ఉన్న శబరి, సీలేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి వద్ద నీటిమట్టం క్రమేనా పెరుగుతున్నది. బుధవారం ఉదయం 30అడుగులకు చేరిన గోదావరి సాయంత్రం వరకు నిలకడగా ఉన్నప్పటికి సాయంత్రం నుండి పెరుగుతున్నది. తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టం క్రమేపీ పెరుగుతుందని, మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా వరద వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా అధికారులు తాము పనిచేసే ప్రాంతాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ అదేశాలను జారీ చేశారు. అలాగే వరద ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచారు. ఎటువంటి వరద వచ్చిన తట్టుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.