రాష్ట్రీయం

సగం నిండిన తుంగభద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూలై 11: తుంగభద్ర జలాశయం సగం నిండింది. జలాశయంలో బుధవారం 50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి ఇన్‌ఫ్లో అంతే భారీగా ఉంది. సుమారు 47 వేల క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా బుధవారం 1616.83 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం వంద టీఎంసీలు కాగా 50.073 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 45,724 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. జలాశయం నుండి 160 క్యూసెక్‌ల మాత్రం బయటకు వదులుతున్నారు. జలాశయం పరివాహక ప్రాంతాలైన చిక్కమంగళూరు, శివమొగ్గ జిల్లాల్లో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో వేగంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో 8 టీఎంసీల నీరు చేరిందన్నారు. ఈనెల 16వ తేదీ మునిరాబాద్‌లోని తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి సమావేశంలో కాలువలకు నీరు విడదల చేసే తేదీలు ఖరారు చేస్తారన్నారు.

పంట వ్యర్థాలను దగ్ధం చేయొద్దు
రైతులు పంట వ్యర్థాలను దగ్ధం చేయొద్దని, పంట వ్యర్థాల కాల్చివేత సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రైతులు వ్యర్థాలను దహనం చేసి పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు కేంద్రం 50 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. ఇందులో సగం పంజాబ్‌కే కేటాయిస్తామని అన్నారు. దుబ్బులను తొలగించే మిషన్ల కొనుగోలుకు రైతులకు 50 శాతం సబ్సిడీ అందజేస్తామని ఆయన చెప్పారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మిషన్ల వాడకంతో దుబ్బులను ఆ భూమిలోనే వేసి దున్నడంతో భూముల సారవంతాన్ని పెంచడమే కాక, కాలుష్యం బెడద తప్పుతుందని అన్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా తమ పొలంలోనే వాటిని వేస్తే హెక్టార్‌కు రెండు వేల రూపాయల వరకు ఎరువుల ఖర్చు తగ్గుతుందని నిపుణులు అంచనా వేశారని ఆయన చెప్పారు. కాగా పంటకోతల తర్వాత రైతులు పెద్దయెత్తున వ్యవసాయ దుబ్బులను తగలబెట్టడం వల్ల ఉత్తర భారతదేశ ప్రాంతంలో తీవ్ర కాలుష్య సమస్య ఏర్పడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటుండటంతో దీని పరిష్కార దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది.