రాష్ట్రీయం

కొత్త గ్రామ పంచాయతీలు 4,383

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నాగర్‌కర్నూల్: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 4,383 గ్రామ పంచాయతీలు ఆగస్టు 2 నుండి పనిచేయడం ప్రారంభం అవుతుందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్‌డీఓలు, జెడ్‌పీ సీఈఓలతో మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీలకు భవనాలను సమకూర్చాలని, వౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త గ్రామ పంచాయతీల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పాత గ్రామ పంచాయతీల నుండి కొత్త గ్రామ పంచాయతీలకు రావలసిన ఆస్తుల విభజన తదితర అంశాలను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా జనాభా ప్రాతిపదికన విభజించి, కొత్త గ్రామ పంచాయతీలకు వాటా ఇవ్వాలని మంత్రి జూపల్లి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అవసరమైన చోట క్లస్టర్ల విభజన కూడా చేయాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3,500 పంచాయతీ కార్యదర్శులను జనాభా ప్రాతిపదికన హేతుబద్ధం (రేషనలైజేషన్) చేయాలన్నారు. నాలుగైదు గ్రామాలకు, ఐదారువేల జనాభాకు ఒక కార్యదర్శి ఉండేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల చివరతో ముగుస్తుండటం వల్ల ప్రస్తుతం ఉన్న పాలక వర్గాల పదవీ కాలాన్ని పొడిగించాలా లేక ప్రత్యేక అధికారులను నియమించాలా అన్న విషయంపై వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జూపల్లి స్పష్టం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత గ్రామ పంచాయతీల పరిపాలన ఏ విధంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. హరితహారం, జాతీయ ఉపాధి హామీ పథకం సజావుగా సాగేలా చూడాలని కోరారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరుతో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్నందున వచ్చే నెల నుంచి గ్రామపంచాయతీకు ప్రత్యేకాధికారులను నియమించాలని జూపల్లి ఆదేశించారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3506 మంది మా త్రమే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని అన్నారు. కొత్త పంచాయతీలతో కలుపుకొని 12,500 పంచాయతీలు ఉన్నాయని, అన్నీ గ్రామపంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులను కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. జనాభా
ప్రాతిపదికన గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలని, జిల్లా కలెక్టర్లు రెండు, మూడు రోజులలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలు, ఈవోపీఆర్డీ, మండల వ్యవసాయాధికారులు, పశుసంవర్ధక శాఖాధికారులు, ఎఈవోలు, పీఆర్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, సీడీపీవో తదితర అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలకు భవనాలతోపాటు స్టేషనరీ, సిబ్బంది తదితర ఏర్పాట్లను చేయాలని, పాత గ్రామపంచాయతీ నుంచి కొత్తవాటికి ఆస్తులు, భూములను పంపిణీ చేయాలని తెలిపారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు రోజున ఆయా గ్రామాలలో విస్తత్రమైన ప్రచారం చేయాలన్నారు. కాగా తెలంగాణకు హరితహారంపై మాట్లాడుతూ వచ్చే సంవత్సరం వందకోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికను రూపొందించడంతోపాటు గ్రామాలలో నర్సరీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరం హరితహారం కింద 40 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినందున తక్షణమే అన్నీ మండలాలలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సంబంధిత వర్గాలు భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్