రాష్ట్రీయం

ఏపీకి వరం ఎయిమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 13: కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విలువైన బహుమతి అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖామంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న ఎయిమ్స్ భవనాల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనందబాబు, వైద్య ఆరోగ్య శాఖ మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎంపీ గోకరాజు గంగరాజులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై ఎయిమ్స్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కేంద్రమంత్రి జేపీ నడ్డా విలేఖర్లతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెల్త్ పాలసీలో భాగంగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఉండాలని నిర్ణయించి 13 ప్రాంతా ల్లో ఎయిమ్స్ నిర్మాణాలను ప్రారంభించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి వద్ద నిర్మిస్తున్న ఎయిమ్స్‌కు 1618 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. మూడు దశల్లో ఈ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుందని, మొదటి ఫేజ్‌లో భాగంగా వచ్చే జనవరి నాటికి ఔట్‌పేషెంట్ విభాగం పూర్తి చేస్తామని, ఎయిమ్స్ కళాశాలకు అవసరమైన అధ్యాపకుల నియామకం ప్రారంభించామన్నారు. తొలి ఏడాది 50 మంది వైద్య విద్యార్థులను
తీసుకుంటున్నామని, తాత్కాలిక ప్రాంగణంలో ఈ విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి నడ్డా పేర్కొన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని నడ్డా అన్నారు. నిర్ణయించిన గడువుకంటే ముందే భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి సుమారు వేయి కోట్ల రూపాయల విలువైన 183 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందన్నారు. జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు రహదారి నిర్మాణం కోసం ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చెందిన భూమిని సేకరించి ఇచ్చామన్నారు. 32 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తోందన్నారు. ఎయిమ్స్ ప్రాంగణం చుట్టూ ప్రహరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్ విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
నిర్మాణాల పరిశీలన
మంగళగిరి పట్టణ శివారులో 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) భవనాల నిర్మాణ పనులను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పరిశీలించారు. ఎయిమ్స్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వివిధ నిర్మాణ దశల్లో ఉన్న భవనాలను కేంద్రమంత్రి నడ్డా పరిశీలించారు. ఎయిమ్స్ భవనాల పూర్తి నమూనాను పరిశీలించి భవనాల పురోగతిని అధికారులతో సమీక్షించారు. మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి 2015 డిసెంబర్ 19వ తేదీన మంత్రి జేపీ నడ్డాయే శంకుస్థాపన చేశారు. అయితే 2017 నుంచి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని పేర్కొన్నారు.

చిత్రం..ఎయిమ్స్ భవనాల నమూనాలు పరిశీలిస్తున్న కేంద్రమంత్రి నడ్డా,
రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ గంగరాజు, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్