రాష్ట్రీయం

హైదరాబాద్‌కు డిఫెన్స్ ఇంక్యుబేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న రక్షణశాఖ ఎకో సిస్టమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంక్యు బేటర్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు టీ -హబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యు బేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి సమాచారం అందినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకంలో భాగంగా డిఫెన్స్ ఇంక్యు బేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారని పేర్కొన్నారు. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకంలో భాగంగా రక్షణ రంగం, ఏరోస్పేస్ రంగంలో పరిశోధనలకు దోహద పడుతుందని చెప్పారని తెలిపారు. పరిశోధకులకు, పరిశోధనా సంస్థలకు, విద్యార్థులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారని తెలిపారు. టి-హబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యు బేటర్ ఏర్పాటుకు రక్షణశాఖ నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు. అనేక దశాబ్దాలుగా హైదరాబాద్‌లో రక్షణ, విమానయాన రంగానికి సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. డీఆర్‌డీవోతో పాటు రక్షణ రంగానికి చెందిన 10 ప్రభుత్వరంగ సంస్థలు, 25 ప్రైవేట్ సంస్థలు, సుమారు వెయ్యికి పైగా రక్షణ రంగ ఎమ్మెస్‌ఎంలు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో డిఫెన్స్ ఇంక్యు బేటర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న ఈకో సిస్టమ్ మరింత బలోపేతం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. టీ -హబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యు బేటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డిఫెన్స్ ఇంక్యు బేటర్‌కు టీ -హబ్ రెండవ దశ భవనంలో స్థలం కేటాయిస్తామన్నారు.