రాష్ట్రీయం

మెడికల్ సీట్ల భర్తీకి రీ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: అధికారుల అలసత్వంవల్లే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ వర్గాలకు ప్రధానంగా బలహీనవర్గాలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీహాలులో ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ సి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ వి రామారావు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మెడికల్ కౌనె్సలింగ్‌లో తీరని అన్యాయం జరుగుతోందని ఫలితంగా ఆందోళన కొనసాగుతోందని చెప్పారు. బీసీ విద్యార్థులు, సంఘాల వాదన న్యాయసమ్మతమైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా 2001లో జారీచేసిన 550 జీవో ప్రకారం గత 16 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందిలేకుండా సీట్లు భర్తీ నిర్వహించారని వివరించారు. అయితే 2017 ఆగస్టు 30న జారీ అయిన ఇంటెర్మ్ స్టే వల్ల సమస్య తలెత్తిందన్నారు. స్టే ఎత్తివేసేందుకు తగిన ఆధారాలు, డాక్యుమెంట్లు ఉన్నత విద్యాశాఖ వద్ద ఉన్నాయన్నారు. వాటిని కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో కౌనె్సలింగ్ నిలిపివేయాలని ఆదేశించారన్నారు. అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగానే స్టే ఎత్తివేతలో ఇప్పటివరకు జాప్యం జరిగిందన్నారు. స్టే ఎత్తివేసిన అనంతరం రీకౌనె్సలింగ్ నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జాప్యానికి కారకులైన అధికారులపై వచ్చే కమిటీ సమావేశంలో చర్చించి తగిన చర్యలు చేపడతామని స్పష్టంచేశారు. ఇకపై రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇటీవల విజయనగరంలో కమిటీ పర్యటించి అన్ని అంశాలను సేకరించిందని తెలిపారు. రిజర్వేషన్లను ఇష్టారాజ్యంగా మలచుకునే హక్కు ఎవరికీలేదన్నారు. కాగా ఎంబీబీఎస్ కౌనె్సలింగ్‌లో కోర్టు స్టే ఎత్తివేసేందుకు తగిన ఆధారాలు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. 550 జీవో ప్రకారం రిజర్వేషన్‌కు అర్హత ఉన్న ఒక అభ్యర్థి ఓపెన్ కేటగిరీ కింద ఒక కళాశాలలో చేరి తరువాత రిజర్వేషన్ కోటాలో మరో కళాశాల లేదా కోర్సులోకి మారితే ఏర్పడిన ఖాళీని అదే రిజర్వు కేటగిరీ అభ్యర్థితో మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సి ఉందన్నారు. 2001 నుంచి ఈ ప్రకారమే సీట్ల భర్తీ జరుగుతోందని వివరించారు. 2017లో తనకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి కౌనె్సలింగ్ ద్వారా సీట్లు కేటాయించారని కొందరు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఇరువర్గాల వాదన విన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. ఈ ఉత్తర్వులు వెలువడేనాటికి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సీట్లు భర్తీ చేస్తున్న సమయంలో రిజర్వేషన్‌వర్గాలు ఆందోళనకు దిగాయన్నారు. మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసి కేసును కొట్టివేయాల్సిందిగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టును కోరిందన్నారు. కేసు సోమవారం విచారణకు రానున్నట్లు అధికారులు బీసీ శాసనసభ కమిటీకి వివరించారు. స్టే ఎత్తివేతకు ఇంతకాలం ఎందుకు ప్రయత్నించలేదని చైర్మన్ తిప్పేస్వామి ప్రశ్నించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఇప్పటికైనా స్టే ఎత్తివేత ప్రక్రియను పూర్తిచేసి రిజర్వేషన్ వర్గాలకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పి అనంతలక్ష్మి, డాక్టర్ బి అశోక్, బి రామ్మూర్తి, ఎమ్మెల్సీ బీఎస్‌సీ రాజసింహులు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.