తెలంగాణ

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక నక్సలైట్ మరణించగా, ముగ్గురు సిఆర్‌పిఎఫ్ కోబ్రా జవాన్లు నేలకొరిగారు. మరో 13మంది జవాన్లు గాయపడగా వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ రాజధాని రాయ్‌పూర్‌కు చికిత్స కోసం హెలీకాప్టర్ ద్వారా తరలించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండల సరిహద్దు సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డబ్బామర్కా గ్రామ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు సుమారు 24 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. జవాన్లు - మావోల మధ్య ఇన్ని గంటల పాటు ఎదురుకాల్పులు జరగడం ఇదే తొలిసారి.
సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ నుంచి డబ్బామర్కా గ్రామ అడవుల్లో కూంబింగ్ కోసం సిఆర్‌పిఎఫ్ 208 కోబ్రా బెటాలియన్‌కు చెందిన జవాన్లతో పాటు డిఆర్‌జీ బలగాలు మొత్తం 200 మంది వెళ్లారు. వీరి రాకను పసిగట్టిన నక్సల్స్ అంబుష్ వేసి కాల్పులకు దిగారు. పర్వతప్రాంతంలోని దట్టమైన అడవుల్లో జరిగిన ఈ పరిణామంతో జవాన్లు తేరుకుని ఎదురుదాడికి దిగారు. ఈ కాల్పుల్లో కోబ్రాకు చెందిన జవాన్లు పటేశ్ సింగ్, ఎన్‌ఎస్ లంజు, లక్ష్మణ్ కుర్తి అక్కడికక్కడే మరణించగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ముగ్గురు ఎస్సైలు కూడా ఉన్నారు. పిఎస్ యాదవ్, యోగేందర్ కుమార్, రజ్‌వీర్ సింగ్ గుర్జార్, కుల్వీర్ సింగ్, యశ్వంత్ రౌత్, ప్రకాశ్ రాథోడ్, మహ్మద్ అఖ్‌లాఖ్, సంతోశ్‌కుమార్, సురేశ్‌కుమార్, రమేశ్ సోరేన్, సోహ్రం, సంజయ్ చాహల్, ఎస్పీ సాహు ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతలు కూడా అక్కడ ఉన్నారని, సుమారు 3 ప్లాటూన్ల సాయుధ నక్సల్స్ దాడికి తెగబడ్డారని సిఆర్‌పిఎఫ్ ఐజీ సదానంద రాత్రే పేర్కొన్నారు.
మూడు విడతలుగా కాల్పులు
మావోయిస్టులు మూడు విడతలుగా దాడికి పాల్పడ్డారు. సంఘటన ప్రదేశం డబ్బామర్కా గ్రామం కిష్టారం పోలీస్ స్టేషన్‌కు 15 కి.మీ.ల దూరంలో ఉంది. పర్వత ప్రాంతం కావడంతో అక్కడికి హెలీకాప్టర్ రావడం కష్టంగా మారింది. గురువారం గాయపడ్డ జవాన్లను, మృతదేహాలను తీసుకొచ్చే సమయంలో మూడు బృందాలుగా విడిపోయి నక్సల్స్ కాల్పులు జరిపారని, వాటిని తిప్పికొట్టి సురక్షితంగా శుక్రవారం కిష్టారం చేరుకున్నామని ఐజీ వెల్లడించారు.
కీలక నక్సల్ అరెస్ట్
ఇదిలావుండగా, దంతెవాడ జిల్లాలోని మటెనార్ పర్వత ప్రాంతంలో శుక్రవారం పోలీసులు ఒక కీలక మావోయిస్టును అరెస్ట్ చేశారు. రాణీబోద్లి పోలీస్ స్టేషన్‌పై 2007 మార్చి 15న దాడి చేసి 55 మంది పోలీసులను హతమార్చిన బృందంలో ఈయన ఒకడు. నేషనల్ పార్కు సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఈయన వద్ద నుంచి 5కిలోల డిటొనేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని బస్తర్ ఐజీ కల్లూరి వివరించారు.