రాష్ట్రీయం

మహోద్యమంగా వనం-మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: రాష్టవ్య్రాప్తంగా వనం-మనం కార్యక్రమాన్ని ప్రభుత్వం మహోద్యమంగా చేపట్టనుంది. కృష్ణాజిల్లా నూజివీడులో ఈనెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున కోటి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాల్‌లో వనం-మనం కార్యక్రమంపై అటవీ, పర్యావరణశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వనం-మనం కార్యక్రమాన్ని కార్తీక వనమహోత్సవం వరకు 127 రోజులు నిరాటంకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలునాటే బాధ్యతను జిల్లాలవారీగా మంత్రులతో పాటు అధికార యంత్రాంగం ప్రజలతో మమేకమై విజయవంతం చేయాలన్నారు. ఒక్కరోజే కోటిమొక్కల సంకల్పానికి అన్నిరకాల విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో 26శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచటమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి అవసరమైన నిధుల సమీకరణపై కూడా దృష్టిసారించాలని కోరారు. నరేగా నిధులను భారీగా వినియోగించు కోవచ్చని సూచించారు. రైల్వేలైన్లు, రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. అటవీప్రాంతంలో కురిసే ప్రతి వర్షపుబొట్టును ఒడిసిపట్టి వృథాకాకుండా చూడాలని ఆదేశించారు. అడవుల చుట్టూ కందకాలు తవ్వాలన్నారు. చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్ డ్యాంలు పెద్దఎత్తున నిర్మించాలని సూచించారు. నాటే ప్రతి మొక్క చెట్టు కావాలని ఆకాంక్షించారు. వృక్షమిత్రలను నియమించి ప్రతిమొక్కను సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. పదేళ్లపాటు ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటగలిగితే హరితాంధ్ర సాధన లక్ష్యాలను అధిగమించ వచ్చన్నారు. ఇందుకోసం నర్సరీల పెంపకానికి ప్రత్యేకంగా డీఎఫ్‌ఒ స్థాయి అధికారిని నియమించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నేరేడు, మారేడు, ఉసిరి వంటి ఔషధ లక్షణాలు ఉన్న మొక్కలతో పాటు సీతాఫలం చెట్లు నాటాలని సూచించారు. ప్రాంతాల వారీగా మొక్కల పెంపకాన్ని డ్వాక్రా గ్రూపులకు అప్పగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా వారికే అప్పగించాలన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు