రాష్ట్రీయం

బీజేపీని నిందిస్తే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన నిధుల్లో 85 శాతం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరుచేసిందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు. కేంద్రం ఉదారంగా నిధులిచ్చినప్పటికీ తమపై టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం పురంధ్రీశ్వరి విలేఖరులతో మాట్లాడారు. బీజేపీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై
ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ‘మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం చేసిన కృషి, ఇచ్చిన నిధుల గురించి వివరించడానికి మేధావులు, వైద్యులు, న్యాయవాదులు, పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి మంజూరుచేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏ మాత్రం ముందుకు కదల లేదన్నారు. మంగళగిరి వద్ద ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం ఎంతో కృషిచేస్తోందని, దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఎయిమ్స్ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా కదల్లేదని విమర్శించడం విచారకరమన్నారు. ఎయిమ్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2019 జనవరిలో ఇక్కడ వైద్య తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. 50 వైద్య సీట్లతో అక్కడ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, అందులో భాగంగా ముంపు మండలాలను ఏపీలో విలీనం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి ప్రసార మాధ్యమాలు సహకరించకపోవడంతో తామే ప్రజల్లోకి వచ్చి వివరిస్తున్నామన్నారు. మహా సంపర్క్ అభియాన్ పేరిట వివిధ వర్గాల్లో కేంద్రంచేస్తున్న కృషిని వివరించడానికి రాష్ట్రంలో పర్యటిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్మార్ట్‌సిటీకి 10 వేల ఇళ్లు కేటాయించామని, అయితే ఇంతవరకు ఈ పథకం ఆచరణలోకి రాలేదన్నారు. కేంద్రంపై రాష్ట్రం సాగిస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పురంధ్రీశ్వరి తెలిపారు. సమావేశంలో బీజేపీ తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి పూడి తిరుపతిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.