రాష్ట్రీయం

ఎన్నికలకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేసారు. కేంద్ర ప్రభుత్వ తీరుపైగానీ, ప్రధాని మోదీ పట్లగానీ సంతృప్తిగా లేమని అన్నారు. ఉత్తమ సీఎం కేసీఆరా? వైఎస్‌ఆరా? అని ఒకరు అడిగిన ప్రశ్నకు ‘సమాధానం మీకే తెలుసు’ అంటూ దాటవేసారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో గంటన్నర పాటు కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. రాజకీయాలు, ప్రభుత్వం, సమస్యలు, వ్యక్తిగత అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటిఆర్ చతురతతో పొడి, పొడి అక్షరాలతో సమాధానం చెప్పారు.
ప్రశ్న: బెస్ట్ సీఎం కేసీఆరా? వైఎస్‌ఆరా?
కేటీఆర్: సమాధానం మీకే బాగా తెలుసు
ప్రశ్న: డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? అందుకు సిద్ధంగా ఉన్నరా?
కేటీఆర్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే
ప్రశ్న: జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయం?
కేటీఆర్: స్వాగతిస్తున్నాం
ప్రశ్న: 2014 ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీ చేయాలని యువత కోరుకుంటున్నారు?
కేటీఆర్: భవిష్యత్‌లో ఏం జరుగుతోందో
ఎవరికి తెలుసు
ప్రశ్న: కేంద్రంలో బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ పట్ల సంతృప్తిగా ఉన్నరా?
కేటీఆర్: లేము
ప్రశ్న: వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచా? శేరిలింగంపల్లా? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
కేటీఆర్: సిరిసిల్ల నుంచే. అక్కడి ప్రజలు మూడుసార్లు నన్ను గెలిపించారు. వారి నమ్మకానికి కట్టుబడి ఉంటాను.
ప్రశ్న: తెలంగాణలో తర్వాతి సీఎం ఎవరు?
కేటీఆర్: కేసీఆరే
ప్రశ్న: నగర బహిష్కరణలపై మీ అభిప్రాయం
కేటీఆర్: లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేదు
ప్రశ్న: నచ్చిన రాజకీయ నేత ఎవరు?
కేటీఆర్: కేసీఆర్, ప్రపంచస్థాయిలో బరాక్ ఒబామా
ప్రశ్న: ఇష్టమైన క్రికెటర్?
కేటీఆర్: రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్
ప్రశ్న: ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానంపై?
కేటీఆర్: ఏపీకి శుభాకాంక్షలు. మేము కేవలం 0.09 శాతంతోనే వెనుకబడి పోయాం.
ప్రశ్న: మీకు ఏ బీర్ ఇష్టం?
కేటీఆర్: అది చెప్పను
ప్రశ్న: ఎంత గొప్ప స్థానంలో ఉన్నా...ఎలా ఒదిగి ఉండాలి?
కేటీఆర్: ఈ స్థానాలు శాశ్వతం కాదు. రెప్పపాటులో మాయమైతాయి
ప్రశ్న: రాజకీయ నేతగా సాధించిన విజయాలు
కేటీఆర్: రాజకీయాలోంచి రిటైరయ్యాక చెబుతా
ప్రశ్న: మీరు అమ్మాయిల ప్రశ్నలకు సమాధానం ఇవ్వరేందుకు?
కేటీఆర్: నాకంత ధైర్యం ఉందా?