రాష్ట్రీయం

కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెవేర్చటాన్ని కేంద్రం ప్రభుత్వం విస్మరించే అంశాన్ని తీవ్రంగా పరిగణించి పార్లమెంట్ వేదికగా తాము చేపట్టబోయే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎంపీల బృందం టీఆర్‌ఎస్‌ను కోరింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ అంశంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయడంలో తమకు మద్దతుగా నిలవాలని టీడీపీ ఎంపీలు టీఆర్‌ఎస్‌కు విజ్జప్తి చేసారు. హైదరాబాద్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు, ఉప నాయకుడు జితేందర్‌రెడ్డితో టీడీపీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరగడంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా టీఆర్‌ఎస్ మద్దతు కోరుతున్నట్టు వారు కేశవరావుకు వివరించారు. మిగిలిన పక్షాల కంటే తోటి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ నుంచి పూర్తి సహకారం కావాలని సుజనా చౌదరి కోరారు. విభజన హామీలను నెరవేర్చక పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగిందని కేశవరావు ఈ సందర్భంగా వివరించారు. షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన, పంపిణీ, హైకోర్టు విభజన తదితర అంశాలను తెలంగాణ కూడా తీవ్రంగా పరిగణిస్తుందని కేశవరావు చెప్పారు. పార్లమెంట్‌లో టీడీపీ చేపట్టబోయే ఆందోళన, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అంశాన్ని తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు కేశవరావు స్పష్టం చేసారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమాశంలో విభజన హామీలపై కేంద్రాన్ని తప్పకుండా నిలదీస్తామని కేశవరావు హామీ ఇచ్చారు. తమ విజ్ఞప్తికి టీఆర్‌ఎస్ సానుకూలంగా స్పందించినట్టు కేశవరావుతో సమావేశం అనంతరం సుజనా చౌదరి తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ నేత కేశవరావుతో సమావేశమైన టీడీపీ ఎంపీల బృందం