ఆంధ్రప్రదేశ్‌

డిజిటల్ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇన్నోవేషన్స్, స్టార్టప్‌లకు ఆంధ్ర గమ్యస్థానంగా నిలవాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించే స్టార్ట్ ఏపీ ఫెస్ట్-2016ను శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో ముందుకొచ్చే విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే విషయంలో ఆంధ్ర కీలకం కానుందన్నారు. ఇప్పటికే డిజిటల్ ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ-ప్రగతి మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ-పాస్ ద్వారా నిత్యావసరాల పంపిణీ, ఆన్‌లైన్ ద్వారా ఉపకార వేతనాల జారీతో అక్రమాలకు అడ్డుకట్ట పడిందన్నారు. సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఔత్సాహికులు, విద్యార్థులు గుర్తించాలన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకొచ్చే విద్యార్థులు, ఔత్సాహికులకు స్టార్టప్ సెంటర్లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. విద్యార్థుల్లో నిగూఢంగా దాగివున్న ప్రతిభ వెలుగులోకి వస్తే సమాజానికి ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. మేథోసంపత్తి గల విద్యార్థుల సమూహాలు, దేశానికి, తద్వారా రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ అంశంలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ ముందుకు సాగుతోందన్నారు. హుదూద్ తుపాను అనంతరం చోటుచేసుకున్న క్లిష్ట పరిస్థితుల నుంచి రికార్డు సమయంలో కోలుకుని సాంకేతికత వైపు వేగంగా పరుగులు తీస్తోందన్నారు. భవిష్యత్‌లో హుదూద్ వంటి తుపాన్లను సైతం తట్టుకునేలా భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐటి, సమచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఐటి సలహాదారు జెఎ చౌదరి, ఐటి శాఖ కార్యదర్శి జి ఫణికిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ ఏపీ ఫెస్ట్ కార్యక్రమంలో ఇన్నోవేషన్స్ సొసైటీ సిఇఓ నిఖిల్ అగర్వాల్, స్టార్టప్ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఔత్సాహికులు పాల్గొన్నారు.

చిత్రం... స్టార్ట్ ఏపీ ఫెస్ట్-2016లో విద్యార్థుల ఆనందం