రాష్ట్రీయం

రహదారులు సెలయేళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 16:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తూర్పు అటవీ ప్రాంతంలోని కొండకోనల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు రోడ్డు పైనుండి ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు, పల్లపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాల కారణంగా ఈ ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ఏజెన్సీలో కాజ్‌వేలు మునిగిపోయాయి. చింతూరు, విఆర్ పురం, ఎటపాక, కూనవరం, రంపచోడవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లోని కొన్ని గ్రామా ల మధ్య వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గత రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సోకులేరు, పాములేరు, సీతపల్లివాగు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో పూర్తి నిల్వ సామర్ధ్యం మేరకు నీరు చేరుకుంది. భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్దిగెడ్డ, ఏలేరు, పంపా, సుబ్బారెడ్డి సాగర్ జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి. భూపతిపాలెం రిజర్వాయర్ నిల్వ సామర్ధ్యం 0.65 టీఎంసీలు కాగా పూర్తిస్థాయిలో నీరు చేరుకుంది.గంగవరం మండలంలోని సూరంపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 1.05 టీఎంసీలు కాగా దాదాపు 1.03 టీఎంసీల నీరు చేరింది. ఇంకొంచెం పెరిగితే బురదకాల్వ పొంగి పరిసర గ్రామాలు ముంపునకు గురవుతాయని భావిస్తున్నారు. 27 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన అడ్డతీగల మండలం మద్దిగెడ్డ రిజర్వాయర్ నీటితో తొణికిసలాడుతోంది. 24 టీఎంసీల నిల్వ సామర్ధ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్‌లోకి ఇటు గోదావరి జలాలు, అటు వరద నీరు భారీగా చేరుతోంది. సుమారు 67వేల ఆయకట్టు కలిగిన ఈ రిజర్వాయర్ కింద ఈసారి సాగుకు గ్యారంటీతోపాటు ముంపునకు గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఎపుడూ లేని విధంగా పంపా రిజర్వాయర్ కూడా 91 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు వాస్తవ సామర్ధ్యం 110 అడుగులు కాగా ఎపుడూ ఎడారిలా కనిపించే ఈ రిజర్వాయరు ప్రస్తుతం నిండుకుండలా మారింది.
ఇదిలా వుండగా గోదావరి నది వరద జలాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అఖండ గోదావరి నది కుడి గట్టు వైపు నుంచి పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు, ఎడమ గట్టు వైపు నుంచి పురుషోత్తపట్నం, పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకాల నుంచి భారీగా వరద జలాలను తోడుతున్నారు.
మరోవైపు గోదావరి నదికి ధవళేశ్వరం దిగువనున్న లంక గ్రామాలు బిక్కు బిక్కుమంటున్నాయి. కాటన్ బ్యారేజీ నుండి నిరంతరాయంగా మూడు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదిలేస్తుండటంతో లంక గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తోంది. ఇప్పటికే వేలాది ఎకరాల వరి చేలు, కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి.