రాష్ట్రీయం

లాభసాటి సాగు లక్ష్యం ఏడాదిలో పోలవరం పూర్తి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 16: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 1500 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని గ్రామ స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజలలో అవగాహన కలిగించేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దొనేపూడి గ్రామం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని సన్‌రైజ్ స్టేట్‌గా మార్చటమే ధ్యేయమని పేర్కొన్న ఆయన 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామన్నారు. పోతార్లంక ఎత్తిపోతల ప్రాజెక్టుతో 5వేల ఎకరాలకు సాగునీరు, 11గ్రామాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో సుమారు రూ.50కోట్లతో నిర్మించిన పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మరోసంవత్సరంలో పూర్తికానుందని చెప్పారు. గ్రావిటీ ద్వారా పొలాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా ప్రస్తుతం 14.5టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు అందిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరువ చేయటంలో నూటికి నూరుశాతం సంతృప్తి స్థాయికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామాలలో చర్చ జరగాలన్నారు. వాటి ఫలితాలు ప్రజలకు చేరుతున్న విధానంపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ ఒన్ స్థానానికి తీసుకువెళ్ళేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు, రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షత వహించారు. 1997లో పోతార్లకం సాగునీటి పథకం కోసం రైతులు తీసుకున్న రుణం అసలు, 10.42లక్షలుకాగా వడ్డీతో కలిపి 48లక్షలు అయిందని, ప్రస్తుతం అప్పు చెల్లించలేని స్థితిలో రైతులు ఉన్నందున మాఫీ చేయాలని మంత్రి ఆనందబాబు కోరిన మీదగా ముఖ్యమంత్రి 12లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందని మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్రం రాష్ట్భ్రావృద్ధికి సహకరించక పోయినా పోలవరంతోపాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నివర్గాలలోని పేదలకోసం అమలుచేస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తమకు సహకరించని కారణంగా పొత్తునుండి బయటకు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర హక్కులకోసం, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా పరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ ఒన్‌గా ఏపీని మార్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు వివరించారు. పేదలపై అభిమానంతో 200రూపాయలున్న పింఛను వేయికి పెంచామని, పేదలకు పెళ్లి కానుకలు అందిస్తున్నామని, బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, గృహాలు నిర్మించి ఇచ్చామని, ఇంటింటికి మరుగుదొడ్లు, ప్రతీగ్రామంలోనూ సిమెంటు రోడ్లు నిర్మించామని, చెత్తచెదారం నుంచి పశువుల ఎరువులు కూడా తయారుచేయించి రైతులకు సేంద్రియ ఎరువులుగా అందిస్తున్నామని తెలిపారు. ఇంతచేసిన తనకు మరిచిపోవద్దంటూ పదేపదే ప్రజలకు విన్నవించుకున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని పలు వీధుల్లో పర్యిటించారు. స్థానికులతో ముచ్చటించారు. గ్రామంలో స్థానికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్న చంద్రబాబు వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలకు సీమంతం కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు గ్రామంలో పిల్లలతో మొక్కలు నాటించి నీళ్లు పోయించారు.