రాష్ట్రీయం

హైదరాబాద్-జైపూర్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆగస్టు 3, 10 శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ప్రత్యే రైలు బయలుదేరుతుంది. కాగా తిరుగు ప్రయాణంలో జైపూర్ నుంచి హైదరాబాద్‌కు ఆగస్టు 5, 12 (ఆదివారం) తేదీల్లో ప్రత్యేక రైలు బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది.
రెండు ప్యాసింజర్ రైళ్లు రద్దు
తెనాలి-విజయవాడ సెక్షన్లో సంగం జాగర్లమూడి స్టేషన్ వద్ద జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా రెండు డెమూ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 17, 24 తేదీల్లో రద్దు చేసినట్లు ద.మ.రై తెలిపింది. నెం.67220 గుంటూరు- తెనాలి డెమూ ప్యాసింజర్ ఈ నెల 17, 24, నెం.67230 తెనాలి-గుంటూరు మధ్య నడిచే డెమూ ప్యాసింజర్ రైలును 17, 24 తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొంది.