రాష్ట్రీయం

విశాఖ రైల్వే జోన్ కోసం పదవిని వదులుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: విశాఖ రైల్వే జోన్ సాధన కోసం తన మంత్రి పదవిని కూడా పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా జేఏసీ చేపట్టే ఎటువంటి నిరసన కార్యక్రమంలోనైనా పాల్గొంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల వరకూ ఈ నిరసన కొనసాగుతుంది. నిరసనకారులు రాత్రంతా రైల్వే స్టేషన్ ఆవరణలోనే నిద్రిస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వే జోన్ గురించి దశాబ్దాల తరబడి పోరాడుతున్నామని అన్నారు. రకరకాల పద్ధతుల ద్వారా ఇప్పటి వరకూ నిరసన తెలిపామని చెప్పారు. రైల్వే జోన్ రాజకీయ నిర్ణయమంటూనే బీజేపీ నేతలు ఇప్పటి వరకూ నెట్టుకుంటూ వచ్చారని ఆయన అన్నారు. విశాఖకు జోన్ డిమాండ్ ప్రారంభమైన తరువాత దేశంలో 15 చోట్ల కొత్త రైల్వే జోన్‌లు ఏర్పడ్డాయని అన్నారు. రామ్‌విలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ లేని చోట కూడా జోన్ తీసుకువచ్చారు. దేశంలోనే అత్యధిక ఆదాయం, ట్రాఫిక్ ఉన్న వాల్తేరు డివిజన్ కేంద్రంగా జోన్ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో కూడా ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. నరేంద్ర మోదీ కూడా ఎన్నికల సభల్లో విశాఖలో జరిగిన బహిరంగ సభలో హరిబాబు సమక్షంలో విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు. రెండు సంవత్సరాల తరువాత రైల్వే మంత్రి విశాఖ వచ్చినప్పుడైనా జోన్ ప్రస్తావన వస్తుందని భావించాం. కానీ నిరాశే ఎదురైందని గంటా అన్నారు. జోన్ కోసం ఎన్ని విధాల నిరసనలు తెలిపినా, కేంద్రం స్పందించడం లేదని ఆయన అన్నారు. అందుకే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు ఇటువంటి నిరసన తెలపడం వలన జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినట్టవుతుందని గంటా చెప్పారు. కొద్దిరోజుల కిందట పార్లమెంట్ సభ్యులు ఇక్కడే నిరాహారదీక్ష చేశారు. ఎన్ని దీక్షలు చేసినా, చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని విశాఖ నుంచి భారీ పోరాటానికి ఉపక్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమం తరువాత భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించనున్నామని మంత్రి చెప్పారు. రైల్వే జోన్ వస్తే, ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రగతికి జోన్ దోహదపడుతుందని గంటా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక నాయకుడు శివశంకర్, నాన్ పొలిటికల్ జేఏసీ నాయకుడు ఈశ్వరరావు, ఎన్జీఓ సంఘ నాయకులు జవహర్‌లాల్, ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.