రాష్ట్రీయం

ఇక పల్లెకు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు ప్రణాళిక సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మురుగునీటి పారుదల, ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఎల్‌ఈడీ వీధి దీపాలు సీసీరోడ్ల నిర్మాణం వంటి వౌలిక వసతుల కల్పనే పునాదిగా పల్లెసీమలు అభివృద్ధిచెందాలని ఆకాంక్షించారు. మంగళవారం సచివాలయంలో ‘స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్’ (ఏపీఎస్‌ఈజీసీ) సమావేశంతో పాటు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్షించారు. ముందుగా ఉపాధి హామీ పథకం అమలుతీరుపై చర్చించారు. నెలకు మండలంలో మూడు గ్రామాల చొప్పున ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్లను నిర్మించాలని, 9వేల గ్రామాల్లో ఈ ఏడాది డిసెంబర్‌లోగా లక్ష్యాలను అధిగమించాలని నిర్దేశించారు. రెండువేల నుంచి ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సీసీ డ్రైనేజీలు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో నిర్మించాలని సూచించారు. ఐదువేల పై చిలుకు జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. నరేగా నిధులతో చెరువులు అనుసంధానంపై దృష్టిసారించాలని రాష్ట్రంలో పెద్దఎత్తున పచ్చదనం పెంపునకు కృషి జరగాలన్నారు. ప్రతి కాలువకు ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి నిర్వహణ, సంరక్షణకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రతిబింబించేలా అమరావతిలో ‘వాటర్ కన్జర్వేషన్ థీమ్ పార్క్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ‘చంద్రన్న కాంతి’ పథకం కింద రాష్టవ్య్రాప్తంగా 23.9 లక్షల ఎల్‌ఈడీ వీధి దిపాల ఏర్పాటు లక్ష్యంకాగా ఇప్పటివరకు 53 శాతం పూర్తిచేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మండలానికో గ్రామంలో ఎకరం విస్తీర్ణంలో 608 విలేజ్ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధంచేశామని, 4వేల 418 స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 1468 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, 278 అంగన్‌వాడీ భవనాలు, 15వేల 21 వ్యక్గిత మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. గ్రామ పంచాయతీలలో మురుగుకాలువలను శుభ్రంచేసి ఫొటోలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని, ఇప్పటి వరకు 7605 కిలోమీటర్ల మేర డ్రెయినేజీలు మెరుగుపరిచామని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘అన్నకాంటీన్ల’ నిర్వహణకై ముఖ్యమంత్రి సహాయనిధికి ‘ఏపీఎస్‌ఈజీసీ’ సభ్యులు రూ 1.5లక్షలు విరాళంగా అందజేశారు. సమీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్, ఉన్నతాధికారులు రామాంజనేయులు, ఎస్‌ఎస్ రావత్, కృష్ణాజిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.