తెలంగాణ

సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న ఇన్‌ఫ్లో గత మూడురోజులుగా కొనసాగుతోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు నాలుగున్న టిఎంసిలు సాగర్ జలాశయం నుండి ఆంధ్రాకు విడుదల చేయనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కుడికాల్వ ద్వారా రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 2.5 టిఎంసిల నీరు విడుదల చేస్తున్నారు. మిగిలిన 2 టిఎంసిలను సాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే స్థానిక జెన్‌కో అధికారులకు 2 టిఎంసిల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూ కృష్ణాడెల్టాకు విడుదల చేయాలని ఆదేశాలు వచ్చాయి. కాగా, విద్యుత్‌కు సంబంధించిన అధికారుల నుండి ఆదేశాలు అందగానే నేడో రేపో విద్యుత్ ఉత్పత్తి చేపడ్తామని సాగర్ జెన్‌కో ఎస్‌ఇ రాజనర్సయ్య తెలిపారు. అయితే ప్రస్తుతం సాగర్ జలాశయంలో 507.60 అడుగులు ఉండగా శ్రీశైలం నుండి 6,968 క్యూసెక్కులు సాగర్‌కు వచ్చి చేరుకుంటోంది. దీని నుండి కుడికాల్వ ద్వారా 6,153 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బిసి ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 820 అడుగుల నీటిమట్టం ఉంది.

‘జడ్పీలకు నిధులివ్వాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: జిల్లా, మండల పరిషత్తులకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని జిల్లా పరిషత్తు చైర్మన్‌లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. మంత్రులకు వీరు తమ సమస్యలను వివరించారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులన్నీ గ్రామ పంచాయితీలకే వెళుతున్నాయని, గతంలో వలె తమకు నిధులు కేటాయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. గతంలో జిల్లా పరిషత్తులకు వంద కోట్ల రూపాయల వరకు ఆర్థిక సంఘం నిధులు కేటాయించేవారని, 14వ ఆర్థిక సంఘం నుంచి పంచాయితీలకు నేరుగా నిధులు చెల్లిస్తూ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు నిధులు కేటాయించడం లేదని జిల్లా పరిషత్తు చైర్మన్‌లు తెలిపారు.
‘గిరిజన వర్శిటీకి త్వరలో నిధులు’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో గిరిజన ఉప ప్రణాళికకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు, ఇతర ప్రజానీకానికి మధ్యన ఉన్న అభివృద్ధి, అసమానతలను తొలగించేందుకు ఎస్‌టి సబ్‌ప్లాన్‌కు దామాషా పద్దతిలో నిధులను కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు.సబ్ ప్లాన్‌కు కేటాయిస్తున్న నిధులను ఆయా విభాగాలు సకాలంలో ఖర్చు చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. నిధులను ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇలాంటివి పునరావృతమైతే అధికారులను బాధ్యులను చేస్తామని మంత్రి హెచ్చరించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యాలను నిర్ధేశించుకుని ఫలితాలను రాబట్టాలని మంత్రి సూచించారు. రానున్న ఆర్ధిక సంవత్సరంలో తండాలు, గూడాల్లో వౌళిక సదుపాయాల కోసం అధిక నిధులను కేటాయిస్తామని, ఇందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సోమేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, గురుకులం కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.