తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయ నమూనాలకు పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం నూతన ఆలయం, బాల ఆలయ నిర్మాణ నమునాలకు, దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ల, ప్రతిపాదనలకు శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, స్థపతి సుందర్ రాజన్ రూపొందించిన ప్రధాన ఆలయం, బాల ఆలయం డిజైన్ మ్యాప్‌లను శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి సూచనల మేరకు డిజైన్ చేశారు. సిఎం కెసిఆర్ ఈ డిజైన్లను ఇటీవల ఆమోదించారు. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి నమూనాలకు స్వామి వారి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో ఎన్.గీతారెడ్డి, చైర్మన్ బి.నరసింహమూర్తి తెలిపారు. ఉగాది నుండి బాల ఆలయం నిర్మాణం చేపట్టి శ్రీరామ నవమికి పూర్తి చేస్తామన్నారు. ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా బాల ఆలయాన్ని 10 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. బాల ఆలయంలో స్వామి, అమ్మవార్ల కవచ మూర్తులతో పాటు క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి, అళ్వార్లను ప్రతిష్ఠిస్తామన్నారు. ప్రయత్నిస్తున్నారు.